వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | హేవా కలుహలముల్లగే సూరజ్ రందీవ్ కలుహలముల్లా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మతార, శ్రీలంక | 1985 జనవరి 30|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 2 అం. (1.88 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | All-rounder | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 113) | 2010 26 July - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2012 25 November - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 139) | 2009 18 December - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2016 24 June - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 35) | 2010 3 May - Zimbabwe తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2011 25 June - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004–2007 | Sinhalese Sports Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005 | Southern Province | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007 | Nondescripts Cricket Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | Kandurata Kites | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008– | Bloomfield Cricket and Athletic Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011– | Ruhuna Rhinos | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | Chennai Super Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 24 March |
సూరజ్ రందీవ్ (జననం 1985, జనవరి 30)[1] శ్రీలంక మాజీ క్రికెటర్. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్‌లను ఆడాడు. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. సూరజ్ మాతర రాహులా కళాశాలలో చదువుకున్నాడు.[2][3] ప్రస్తుతం బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.[4]
అండర్-15, అండర్-19 స్థాయిలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. 2003-04 అండర్-23 టోర్నమెంట్‌లో నాలుగు మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసుకున్నాడు. దాంతో మార్వన్ అటపట్టు సహకారంతో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో చేరాడు. శ్రీలంక ఎ, శ్రీలంక తరపున ఆడాడు.
2009, డిసెంబరులో ముత్తయ్య మురళీధరన్ స్థానంలో శ్రీలంక వన్డే జట్టులోకి వచ్చాడు. నాగ్‌పూర్‌లో జరిగిన సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 51 పరుగులకు మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.[5]
గాయపడిన ఏంజెలో మాథ్యూస్‌కు 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు ఎంపికయ్యాడు.[6]
5 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత 2016లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అక్కడ 2016 జూన్ 24న రెండో వన్డేలో ఆడాడు.
2011 ఐపిఎల్ ప్లేయర్ వేలంలో రందీవ్ చెన్నై సూపర్ కింగ్స్ చేత తీసుకోబడ్డాడు. రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు.[7] 2012లో ఐపిఎల్ 5 ప్రారంభానికి ముందు విడుదలయ్యాడు. 2016లో ఉత్తర ఐర్లాండ్‌లోని కొలెరైన్ క్రికెట్ క్లబ్‌కు వారి నియమించబడిన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఆడాడు.[8]
ఆస్ట్రేలియాకు వలస వెళ్ళిన తరువాత ఆస్ట్రేలియాలో జిల్లాస్థాయి పోటీలలో ఆడాడు. విక్టోరియా ప్రీమియర్ క్రికెట్‌తో అనుబంధంగా ఉన్న డాండెనాంగ్ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు.[9][10] 2020 డిసెంబరులో భారత్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ)కి ముందు నెట్స్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ల వద్ద బౌలింగ్ చేయడానికి నెట్ బౌలర్‌గా తాత్కాలిక పాత్ర కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇతన్ని ఆహ్వానించింది.[11]
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ ప్రజా రవాణా సంస్థ ట్రాన్స్‌దేవ్‌లో బస్ డ్రైవర్‌గా పినచేస్తున్నాడు.[12]