Soreng | |
---|---|
Coordinates: 27°10′N 88°12′E / 27.17°N 88.20°E | |
Country | India |
State | Sikkim |
District | Soreng |
Government | |
• Type | Municipal Council |
• Body | Soreng Municipal Council |
జనాభా (2011)[1] | |
• Total | 3,818 |
Languages | |
• Official | Sikkimese, Nepali, Lepcha, Limbu, Newari, Rai, Gurung, Mangar, Sherpa, Tamang and Sunwar |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | SK 06 |
సోరెంగ్, భారతదేశం, సిక్కిం రాష్ట్రం, సోరెంగ్ జిల్లా లోని ఒక గ్రామం.[2] జిల్లా ప్రధాన కార్యాలయం. సోరెంగ్ జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా. సోరెంగ్ పట్టణం కూరగాయలు, నారింజ, పువ్వుల అతిపెద్ద ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. నివాసితులు ఎక్కువగా వ్యవసాయం, పూల పెంపకం, పర్యాటకం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఎక్కువగా పట్టణం ప్రాంతంలో సిక్కిమీస్, నేపాలీలు సమాజాలకు చెందిన వారు అత్యధికులుగా ఉన్నారు.మతాలకు వచ్చేసరికి అత్యధికులు హిందూమతం, బౌద్ధమతాలను అనుసరిస్తుండగా, మిగిలినవారు క్రైస్తవులు.
సోరెంగ్ పట్టణం దాదాపు డార్జిలింగ్ నుండి రోడ్డు మార్గంలో 45 కి.మీ. (28 మైళ్లు) దూరంలో, రాజధాని గాంగ్‌టక్ నుండి 102 కి.మీ. (63 మైళ్లు) దూరంలో ఉంది.ఈ ప్రాంతం ఎకో టూరిజం ప్రదేశం.ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శిస్తారు. ఇది దరమ్‌దిన్‌కు దగ్గరగా ఉంది.
ఈ ప్రాంతం ప్రధాన ఆకర్షణలు దాని ప్రకృతి దృశ్యాలు, మత్స్య సంపద, కాంచన్‌జంగా పర్వత దృశ్యాలు, వృక్షజాలం, జంతుజాలం, తీస్తా నదిపై వైట్ నదిపై పడవ ప్రయాణం అహ్లాదకరంగా ఉంటాయి.
ప్రస్తుతం సోరెంగ్ ఎమ్మెల్యే ఆదిత్య గోలే తమాంగ్ (సిక్కిం క్రాంతికారి మోర్చా).
సోరెంగ్ సిక్కింలోని పశ్చిమ జిల్లా జిల్లాలోని సోరెంగ్ ఉపవిభాగంలో ఉన్న గ్రామం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సోరెంగ్ గ్రామంలో మొత్తం 887 కుటుంబాలు నివసిస్తున్నాయి. సోరెంగ్ గ్రామ జనాభా మొత్తం 3,818, అందులో 1,937 మంది పురుషులు కాగా, 1,881 మంది స్త్రీలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 971.[3]
సోరెంగ్ గ్రామంలో 0-6 సంవత్సరాల వయస్సు లోపు పిల్లల జనాభా 368, ఇది మొత్తం జనాభాలో 10% శాతంగా ఉంది. వారిలో 0-6 సంవత్సరాల మధ్య 199 మంది మగ పిల్లలు ఉండగా, 169 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఆ విధంగా 2011 భారత జనాభా లెక్కల ప్రకారం సోరెంగ్‌లోని పిల్లల లింగ నిష్పత్తి 849, ఇది సోరెంగ్ గ్రామంలోని సగటు లింగ నిష్పత్తి (971) కంటే తక్కువ.[3]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సోరెంగ్ అక్షరాస్యత రేటు 83.4%. దీనిని జిల్లా 68.5% అక్షరాస్యత రేటు తో పోలిస్తే సోరెంగ్ గ్రామం అధిక అక్షరాస్యత రేటును కలిగి ఉంది. సోరెంగ్ గ్రామంలో పురుషుల అక్షరాస్యత రేటు 87.28% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 79.44% ఉంది.[3]