సౌమ్య జోషి | |
---|---|
![]() సౌమ్య జోషి (2013) | |
Born | సౌమ్య జయంత్ భాయ్ జోషి 3 జూలై 1973 అహ్మదాబాద్, గుజరాత్ |
Occupation | కవి, రచయిత, నాటక రచయిత, దర్శకుడు, నటుడు |
Education | ఎంఏ |
Alma mater | గుజరాత్ విశ్వవిద్యాలయం |
Genres | నాటకం, గజల్, పద్యం, పాట |
Years active | 1991 - ప్రస్తుతం |
Relatives | అభిజత్ జోషి (అన్న) |
Signature | |
![]() |
సౌమ్య జోషి, గుజరాత్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, నాటక రచయిత, దర్శకుడు, నటుడు. గుజరాతీ సాహిత్యంతో, నాటకరంగంతో, సినిమారంగంతో అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. గుజరాతీ నాటకరంగంలో వెల్కమ్ జిందగీ, 102 నాటౌట్ నాటకాలకు ప్రసిద్ధి చెందాడు. 2008లో గ్రీన్రూమ్మా (ఇన్ ది గ్రీన్‌రూమ్) అనే కవితల సంకలనాన్ని వెలువరించాడు. గుజరాతీ నాటకరంగానికి చేసిన కృషికి 2013లో చంద్రవదన్ చిమన్లాల్ మెహతా అవార్డు అందుకున్నాడు. యువ గౌరవ్ పురస్కార్ (2007), తఖ్తసిన్హ్ పర్మార్ ప్రైజ్ (2008-09) కూడా అందుకున్నాడు.[1]
జోషి 1973, జూలై 3న గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌లో జయంత్ జోషి - నీలా జోషి దంపతులకు జన్మించాడు. 1990లో అహ్మదాబాద్‌లోని విజయనగర్ హైస్కూల్లో ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తిచేసిన అనంతరం, 1993లో అహ్మదాబాద్‌లోని హెచ్‌కె ఆర్ట్స్ కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1995లో ఇంగ్లీషు సాహిత్యాన్ని తన సబ్జెక్టులలో ఒకటిగా తీసుకుని గుజరాత్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశాడు.[2]
ఇతడు రాసిన 102 నాటౌట్ అనే నాటకాన్ని ఉమేష్ శుక్లా అనే పేరుతో సినిమాగా తీశాడు. ఈ సినిమాకు రచయితగా గుర్తింపు పొందిన జోషి,[3] 2018 హెల్లారో అనే గుజరాతీ సినిమాకు సంభాషణలు, పాటలు రాశాడు.[4]
గుజరాతీ సాహిత్యంలో చేసిన కృషికి 2007లో యువ గౌరవ్ పురస్కార్, 2008-09లో తఖ్తసిన్హ్ పర్మార్ బహుమతి గెలుచుకున్నాడు. గుజరాతీ నాటకరంగంలో చేసిన కృషికి 2013లో ప్రఖ్యాత గుజరాతీ నాటక రచయిత చంద్రవదన్ మెహతా పేరు మీద చంద్రవదన్ చిమన్లాల్ మెహతా అవార్డు అందుకున్నాడు. రావ్జీ పటేల్ అవార్డు, బల్వంతరాయ్ ఠాకోర్ ప్రైజ్, 2014లో సద్భావన అవార్డు కూడా స్వీకరించాడు.[5][1]