హనుమాన్ బెనివాల్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 | |||
ముందు | సి.ఆర్. చౌదరి | ||
---|---|---|---|
నియోజకవర్గం | నాగౌర్ లోక్‌సభ నియోజకవర్గం | ||
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ మొదటి అధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 అక్టోబరు 29 | |||
రాజస్థాన్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2008 – 2019 | |||
తరువాత | నారాయణ్ బెనివాల్ | ||
నియోజకవర్గం | ఖిన్వసర్ శాసనసభ నియోజకవర్గం | ||
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ జాతీయ కన్వీనర్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2018 | |||
రాజస్థాన్ విశ్వవిద్యాలయం స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 1997 – 1998 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బరంగావ్, నాగౌర్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం | 2 మార్చి 1972||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (2013 వరకు) | ||
జీవిత భాగస్వామి |
కనికా బెనివాల్ (m. 2009) | ||
సంతానం | 2 | ||
నివాసం | రాజస్థాన్ హౌస్, న్యూఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | రాజస్థాన్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | సామాజిక కార్యకర్త, వ్యవసాయవేత్త |
హనుమాన్ బెనివాల్ (జననం 1972 మార్చి 2) భారతీయ రాజకీయ నాయకుడు, రైతు ఉద్యమ నాయకుడు. ఆయన రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 17వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నాడు. జైపూర్‌లో, ఆయన 2018 అక్టోబర్ 29న ఏర్పడిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, జాతీయ కన్వీనర్ కూడా.[1][2][3]
ఆయన 1972 మార్చి 2న రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని బరంగావ్ గ్రామంలో రామ్‌దేవ్, మోహినీ దేవి దంపతులకు జన్మించాడు.[4] ఆయన 1993లో రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. 1998లో, ఆయన ఎల్.ఎల్.బి కూడా పూర్తి చేసాడు.[5] అతని తమ్ముడు నారాయణ్ బెనివాల్ కూడా రాజకీయ నాయకుడె.[6]
2017 ఏప్రిల్ 25న, మూడు వేర్వేరు శాఖలకు సంబంధించినవి కావడంతో ఆయన ప్రశ్నలను స్పీకర్ కైలాష్ మేఘవాల్ రద్దు చేసాడు. దీంతో ఆయన స్పీకర్ వెల్ వద్దకు వెళ్లి పేపర్లు చింపి, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి రాజేంద్ర రాథోడ్‌పై విమర్శలు గుప్పించారు.[7][8][9]
2020లో, ఆయన రైతు బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలో పాలుపంచుకున్నాడు, ఇవి రైతు వ్యతిరేకమని నినదించాడు. తాను లోక్‌సభలో ఉండి ఉంటే వ్యవసాయ బిల్లులను చించివేసి ఉండేవాడినని అని వాఖ్యలు చేసాడు.[10]
2018 అక్టోబరు 29న, ఆయన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీని స్థాపించాడు, ఈ ప్రక్రియలో దాని అధ్యక్షుడు జాతీయ కన్వీనర్ అయ్యాడు. భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో పాటు రాజస్థాన్ రాష్ట్రంలో విజయవంతమైన మరొక పార్టీగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ మారింది.[11][12]
ఆయన 2009 డిసెంబరు 9న కనికా బెనివాల్‌ను వివాహం చేసుకున్నాడు, వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.[13][14]
ఆయన రాజస్థానీ జానపద దైవం వీర్ తేజ అనుచరుడు, శిష్యుడు.[15][16]