హేమ | |
---|---|
![]() | |
జననం | కృష్ణవేణి 1977, నవంబరు 12 |
వృత్తి | సినిమా నటి, రాజకీయ నాయకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1989– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సయ్యద్ జాన్ అహ్మద్[1][2] |
పిల్లలు | ఇషా జాన్ [3] |
హేమ (జననం కృష్ణ వేణి ) తెలుగు సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘కొండపొలం’ వరకూ ఆమె 509 చిత్రాల్లో నటించారు. మూడు టీవీ సీరియల్స్ లోనూ నటించారు.
హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజోలులో 1977 నవంబరు 12న జన్మించారు. ఆమె తండ్రి పేరు కోళ్ల కృష్ణ, తల్లి పేరు కోళ్ల లక్ష్మి. భర్త పేరు జాన్ అహ్మద్. ఆమెకు ఒక పాప. పేరు ఇషా జాన్.[4] ఆమె ఏడవ తరగతి వరకు చదువుకుంది.[5]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అసోసియేషన్ లో కార్యవర్గ సభ్యురాలిగా రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా ఎంపికయ్యారు. గత ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి 225 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. స్వతహాగా ఆమెకు రాజకీయాలన్నా, సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నా ఆసక్తి ఎక్కువ.హేమ 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది.[6][7] ఆమె 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[8] హేమ 2021, ఏప్రిల్ 13న భారతీయ జనతా పార్టీలో చేరింది.[9]
తెలుగు సినిమాలు[10]
హైదరాబాద్‌కు చెందిన వాసు తన పుట్టినరోజు సందర్బంగా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌస్‌లో 2024 మే 19న 150 మందితో ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేయగా పార్టీలో భారీ డీజే సౌండ్ రావడంతో పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఫామ్‌హౌస్ పై దాడి చేసి రేవ్ పార్టీలో తనిఖీలు నిర్వహించగా పట్టుబడ్డవారిలో నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశాడు. రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది నుంచి రక్తపు నమూనాలు సేకరించగా నటి హేమతో పాటు 86 మంది డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయిందని మే 27న విచారణకు హాజరు కావాలని ఆమెకు సీసీబీ పోలీసులు (City Crime Branch Police) నోటీసులు జారీ చేశారు.[11][12][13] హేమని బెంగుళూరు పోలీసులు జూన్ 03న అరెస్టు చేశారు.[14] హేమకు జూన్ 12న బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.[15]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)