హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగర అభివృద్ధి ప్రణాళిక సంస్థ. ఇది 7,257 కిమీ (2,802 చదరపు మైళ్ళు) విస్తీర్ణం పరిధిలోవున్న హైదరాబాద్ జిల్లా, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాలు, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్ధిపేట జిల్లాలతో కూడిన హైదరాబాద్ మహానగర ప్రాంతాన్ని నిర్వహిస్తుంది.[1][2] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా), హైదరాబాదు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ (హడా), సైబరాబాదు అభివృద్ధి సంస్థ (సిడిఎ), బుద్ధ పూర్ణిమా ప్రాజెక్ట్ సంస్థ (బిపిపిఎ) వంటి సంస్థలను 2008లో విలీనం చేసి ఈ హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు.
7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాలను కలిగివున్న ఈ మహానగర ప్రాంతంలో హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఉంది. ఇందులో 175 గ్రామాలు, 31 గ్రామాలతో కూడిన 12 ముస్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఉన్నాయి.
క్రమసంఖ్య | జిల్లా | మండలాలు | మొత్తం మండలాలు |
---|---|---|---|
1 | హైదరాబాదు జిల్లా | మొత్తం జిల్లా | 16 |
2 | మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా | మొత్తం జిల్లా - ఘటకేసర్, శామీర్‌పేట, మేడ్చెల్, ఉప్పల్, కీసర, కుత్బుల్లాపూర్, మేడిపల్లి, బాచుపల్లి, దుండిగల్, కాప్రా, బాలానగర్, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, అల్వాల్ | 14 |
3 | రంగారెడ్డి జిల్లా | చేవెళ్ళ, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూర్, మహేశ్వరం, మంచాల్, మొయినాబాదు, రాజేంద్ర నగర్, సరూర్‌నగర్, షాబాద్, శంషాబాదు, శంకర్‌పల్లి, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, ఫరూఖ్‌నగర్, గండిపేట్, కొత్తూరు, నందిగామ, శేరిలింగపల్లి | 20 |
4 | సంగారెడ్డి జిల్లా | పటాన్‌చెరు, రామాచంద్రాపురం, సంగారెడ్డి, అమీనాపూర్, గుమ్మడిదల, జిన్నారం, కంది, హత్నూర | 8 |
5 | మెదక్ జిల్లా | మనోహరబాద్, నర్సాపూర్, శివంపేట, తూఫ్రాన్ | 4 |
6 | సిద్ధిపేట జిల్లా | మర్కూక్, ములుగు, వర్గల్ | 3 |
7 | యాదాద్రి భువనగిరి జిల్లా | బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి | 5 |
ఈ సంస్థ 6696 కోట్ల రూపాలయ ఖర్చుతో ఔటర్ రింగ్ రోడ్‌ను నిర్మించింది. 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2018, మే నెలలో పూర్తయింది.[3]
నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడం, మెరుగైన ప్రయాణ సదుపాయాలను కల్పించి, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరులకు దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ బాటసింగారం, మంగల్‌పల్లి దగ్గర లాజిస్టిక్ పార్కులను ఏర్పాటుచేయబడ్డాయి.[4]
కొత్తగా నిర్మితమవతున్న ప్రాంతాలలో భవనాల నిర్మాణం కోసం బిల్డర్ల చెల్లించే అభివృద్ధి ఛార్జీలో హైదరాబాదు మహానగర అభివృద్ధి పనులకోసం 50 శాతం పెరుగుదలను ప్రభుత్వం ఆమోదించింది.[5]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)