100 డేస్ ఆఫ్ లవ్ | |
---|---|
దర్శకత్వం | జీనస్ మహమ్మద్ |
రచన | జీనస్ మహమ్మద్ |
నిర్మాత | వెంకట రత్నం |
తారాగణం | దుల్కర్ సల్మాన్ నిత్యా మీనన్ శేఖర్ మీనన్ అజు వర్గీస్ |
ఛాయాగ్రహణం | ప్రతీష్ వర్మ |
కూర్పు | సందీప్ కుమార్ |
సంగీతం | పాటలు: గోవింద్ మీనన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం : బిజీబాల్ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎస్.సి.మూవీస్ |
విడుదల తేదీ | 26 ఆగస్టు 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
100 డేస్ ఆఫ్ లవ్ 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో ఎస్.ఎస్.సి.మూవీస్ బ్యానర్‌పై వెంకట రత్నం ఈ సినిమా తెలుగులో విడుదల చేశాడు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జీనస్ మహమ్మద్ దర్శకత్వం వహించగా, 26 ఆగష్టు 2016న విడుదల చేశారు.[2]
రావుగోపాల రావు (సల్మాన్ దుల్కర్) టైమ్స్ సంస్థలో పని చేస్తుంటాడు. ఆయనకు సావిత్రి (నిత్యా మీనన్) పరిచయం ఆవుతుంది. అయితే ఆమె తాను చిన్నప్పుడు ఎంతగానో అసహ్యించుకన్న తన స్కూల్ మేట్ సావిత్రి అని తెలుస్తోంది. అప్పటి నుంచి సావిత్రిని పక్కనపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, సావిత్రి మాత్రం అతనికి దగ్గరవుతూనే ఉంటుంది. సావిత్రికి మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ జరగటం, ఆపై గోపాల్ రావుకి ఆమె ప్రేమ కలగటం ఒకేసారి జరుగుతాయి. మరి వారిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా సినిమా కథ.[3]