17వ లోక్‌సభ | |||||
---|---|---|---|---|---|
| |||||
అవలోకనం | |||||
శాసనసభ | భారత పార్లమెంట్ | ||||
కాలం | 2019 మే 24 – | ||||
ఎన్నిక | 2019 భారత సార్వత్రిక ఎన్నికలు | ||||
ప్రభుత్వం | మూడవ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం | ||||
సార్వభౌమ | |||||
రాష్ట్రపతి | ద్రౌపది ముర్ము | ||||
ఉపరాష్ట్రపతి | జగదీప్ ధన్కర్ | ||||
హౌస్ ఆఫ్ ది పీపుల్ | |||||
సభ్యులు | 543 | ||||
సభ స్పీకర్ | ఓం బిర్లా | ||||
సభ నాయకుడు | నరేంద్ర మోదీ | ||||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||||
ప్రతిపక్ష నాయకుడు | ఖాళీ 2014 మే 26 నుండి | ||||
పార్టీ నియంత్రణ | జాతీయ ప్రజాస్వామ్య కూటమి |
2019 భారత సార్వత్రిక ఎన్నికలలోఎన్నికైన సభ్యులచే 17వ లోక్‌సభ ఏర్పడింది.[1] రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(2) ప్రకారం, ప్రజల సభ, త్వరగా రద్దు చేయబడితే తప్ప, దాని మొదటి సమావేశానికి నియమించబడిన తేదీ నుండి ఐదేళ్లపాటు కొనసాగుతుంది. భారతదేశం అంతటా ఎన్నికలను భారత ఎన్నికల సంఘం 2019 ఏప్రిల్ 11 నుండి 2019 మే 19 వరకు ఏడుదశల్లో నిర్వహించింది. 2019 మే 23 ఉదయం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అదే రోజు ఫలితాలు ప్రకటించారు. 17 వ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యాడు. ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని దక్కించుకోవడానికి ఏ పార్టీకి కనీసం 10% స్థానాలు పొందలేదు. అందువలన 17వ లోక్‌సభకు ప్రతిపక్ష నాయకుడును ఎన్నుకోబడలేదు.అయితే లోక్‌సభలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు అధిర్ రంజన్ చౌదరి నేతగా ఉన్నాడు.[2][3] 17వ లోక్‌సభలో మహిళా ప్రతినిధులు అత్యధికంగా 14 శాతం మంది ఉన్నారు. మొత్తం 545 మంది లోక్‌సభ సభ్యులలో, తొలిసారి ఎంపీలుగా 267 మంది సభ్యులు గెలుపొందారు. గెలుపొందిన మొత్తం సభ్యులలో 233 మంది సభ్యులపై (43 శాతం) నేరారోపణలు ఉన్నాయి.
పార్టీ | సీట్లు | లోకసభలో ఆ పార్టీ లీడరు | |
---|---|---|---|
BJP | 290 | నరేంద్ర మోదీ | |
INC | 46 | అధీర్ రంజన్ చౌదరి [8] | |
DMK | 24 | టి.ఆర్.బాలు [9] | |
AITC | 23 | సుదీప్ బంద్యోపాధ్యాయ [10] | |
వైకాపా | 22 | పి.వి.మిధున్ రెడ్డి [11] | |
JD(U) | 16 | రాజీవ్ రంజన్ సింగ్ [12] | |
SHS | 13 | రాహుల్ షెవాలే [13] | |
BJD | 12 | పినాకి మిశ్రా | |
BSP | 9 | గిరీష్ చంద్ర | |
BRS | 9 | నాగేశ్వరరావు | |
SS(UBT) | 6 | వినాయక్ రౌత్ | |
RLJP | 5 | పశుపతి కుమార్ పరాస్ | |
NCP | 4 | సుప్రియా సూలే | |
తెదేపా | 3 | కె రామ్మోహన్ నాయుడు | |
IUML | 3 | ఇ.టి. మహమ్మద్ బషీర్ | |
JKNC | 3 | ఫరూక్ అబ్దుల్లా | |
CPI(M) | 3 | పి ఆర్ నటరాజన్ | |
SP | 3 | ఎస్.టి.హసన్ | |
CPI | 2 | కె. సుబ్బరాయన్ | |
AD(S) | 2 | అనుప్రియా పటేల్ | |
SAD | 2 | హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ | |
AIMIM | 2 | అసదుద్దీన్ ఒవైసీ | |
AIUDF | 1 | బద్రుద్దీన్ అజ్మల్ | |
SAD(A) | 1 | సిమ్రంజిత్ సింగ్ మాన్ | |
KC(M) | 1 | టి. చాజికడన్ | |
JD(S) | 1 | ప్రజ్వల్ రేవణ్ణ | |
NCP | 1 | సునీల్ తట్కరే | |
LJP(RV) | 1 | చిరాగ్ పాశ్వాన్ | |
JMM | 1 | విజయ్ కుమార్ హన్స్‌దక్ | |
AAP | 1 | సుశీల్ కుమార్ రింకూ | |
VCK | 1 | టి.తిరుమావలన్ | |
RSP | 1 | ప్రేమచంద్రన్ | |
NDPP | 1 | టి.యెప్తోమి | |
AJSU | 1 | సీపీ చౌదరి | |
NPF | 1 | లోర్హో ఫోజ్ | |
NPP | 1 | అగాథా సంగ్మా | |
MNF | 1 | సి. లాల్‌సంగా | |
SKM | 1 | ఐ.హచ్. సుబ్బ | |
Independent | 6 |
| |
Vacant | 21 |
| |
మొత్తం | 545 |
పార్టీ | ఎన్నికైన
సభ్యులు |
నేరారోపణల సభ్యులు |
శాతం | |
---|---|---|---|---|
బీజేపీ | 303 | 116 | 39% | |
ఐ.ఎన్.సి | 52 | 29 | 57% | |
డిఎంకె | 24 | 10 | 43% | |
జెడి (యు) | 16 | 13 | 81% | |
ఎఐటిసి | 22 | 9 | 41% |
17వ లోక్‌సభలో అత్యధికంగా మొత్తం సభ్యులలో 78 మంది మహిళా రాజకీయ నాయకులు అంటే దాదాపు 14% మంది ఉన్నారు.[15] అంతకుముందు లోక్‌సభలో 62 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 17వ లోక్‌సభ సభ్యుల సగటు వయస్సు 54 సంవత్సరాలు. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 12% మంది ఎంపీలు ఉన్నారు. కియోంజర్ నియోజకవర్గం నుండి బిజెడి పార్టీకి చెందిన చంద్రాని ముర్ము 25 సంవత్సరాల 11 నెలల తొమ్మిది రోజుల వయస్సులో అతిపిన్న వయస్కురాలిగా, సంభాల్ నియోజకవర్గం నుండి సమాజ్ వాదీ పార్టీకి చెందిన షఫీకర్ రహ్మాన్ బార్క్ 89 సంవత్సరాల వయస్సుతో అతి పెద్ద వయస్సు సభ్యురాలుగా ఉన్నారు.[16][17] విద్య వారీగా, 43% మంది లోక్‌సభ సభ్యులు గ్రాడ్యుయేట్ -స్థాయి విద్యను కలిగి ఉన్నారు, 25% మంది పోస్ట్-గ్రాడ్యుయేట్లు,4% మంది సభ్యులు వివిధ సబ్జెక్టులలో డాక్టరేట్లను కలిగి ఉన్నారు. మొత్తం సభ్యులలో 300 మంది సభ్యులు మొదటిసారి సభ్యులుగా ఎన్నికయ్యారు. 197 మంది సభ్యులు వరుసగా రెండవసారి ఎన్నికయ్యారు. అంటే వారు 16వ లోక్‌సభలో సభ్యులుగా పనిచేసి తిరిగి ఎన్నికైయ్యారు.[15] సుల్తాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ సభ్యులు మేనకా గాంధీ, బరేలీ నియోజకవర్గం నుంచి సంతోష్ గంగ్వార్ ఎనిమిదోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.[18] మతపరంగా 90.4% మంది సభ్యులు హిందువులు కాగా, 5.2% మంది ముస్లింలు, మిగిలిన వారు దాదాపు 4% మందిలో సిక్కులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలకు చెందినవారు ఉన్నారు.[18]
ప్రభుత్వేతర సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ప్రకారం, 233 మంది సభ్యులు (అంటే 43%) పై నేరారోపణలు ఉన్నాయి.వీటిలో దాదాపు 29% కేసులు అవి అత్యాచారం, హత్య, హత్యాయత్నం లేదా మహిళలపై నేరాలు లాంటివి. కేరళలోని ఇడుక్కి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ డీన్ కురియకోస్‌పై 204 క్రిమినల్ కేసులు ఉన్నాయి.[14]
ఆర్థికంగా, కోటీశ్వరులైన సభ్యుల సంఖ్య (అనగా ₹1 కోటి (US$130,000) కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నవారు) 475 మంది ఉన్నారు. ₹5 కోట్ల (US$630,000) కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన సభ్యులు 266 మంది ఉన్నారు. మొత్తం లోక్‌సభ సభ్యుల సగటు ఆస్తులు ₹20.9 కోట్లు (US$2.6 మిలియన్లు) చింద్వారా నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌కు చెందిన నకుల్ నాథ్ దాదాపు ₹660 కోట్లు (US$83 మిలియన్లు) అత్యధిక ఆస్తులు ప్రకటించిన సభ్యుడు. నకుల్ నాథ్ తర్వాతి స్థానంలో కన్యాకుమారి నియోజకవర్గం నుండి హెచ్. వసంతకుమార్ ఉన్నారు, ₹417 కోట్లు (US$52 మిలియన్), బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుండి డి. కె. సురేష్ ₹338 కోట్లు (US$42 మిలియన్) ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే.
2021 నవంబరు నాటికి, 17వ లోక్‌సభ కాలంలో, 12% బిల్లులు పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు పంపబడ్డాయి.[19][20][21]