1977 భారత రాష్ట్రపతి ఎన్నికలు

1977 భారత రాష్ట్రపతి ఎన్నికలు

← 1974 1977 ఆగష్టు 6 1982 →
 
Nominee నీలం సంజీవరెడ్డి
Party జనతా పార్టీ
Home state ఆంధ్రప్రదేశ్
Electoral vote ఏకగ్రీవం


President before election

ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
భారత జాతీయ కాంగ్రెస్

Elected President

నీలం సంజీవరెడ్డి
జనతా పార్టీ

భారత ఎన్నికల సంఘం 1977 ఆగస్టు 6న ఏడవ భారత రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. భారత రాష్ట్రపతి ఎన్నికలకు 37 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు, వారిలో 36 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి , దీనితో నీలం సంజీవ రెడ్డి పోటీలో ఒక్కడే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1]

నేపథ్యం

[మార్చు]

భారత రాష్ట్రపతిగా ఉన్న, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, మరణించడంతో, [2] [3] భారత ఉపరాష్ట్రపతి బి.డి. జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. [4] రాష్ట్రపతి పదవికి ఎన్నికను ఖాళీ అయిన తేదీ నుండి 6 నెలల్లోపు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాలి.

ఎలక్టోరల్ కాలేజీ లోక్‌సభ (524), రాజ్యసభ (232) 22 రాష్ట్ర శాసనసభల (3776) సభ్యులను కలిగి ఉంది, మొత్తం 4532 మంది ఓటర్లు ఉన్నారు. [4]

ఎన్నికల షెడ్యూలు

[మార్చు]

భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం 1977 జులై 4న ప్రకటించింది [4]

స.నెం. పోలింగ్ కార్యక్రమాలు తేదీ
1. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 1977 జులై 18
2. నామినేషన్ పరిశీలన తేదీ 1977 జులై 19
3. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 1977 జులై 21
4. పోలింగ్ తేదీ 1977 ఆగస్టు 6
5. కౌంటింగ్ తేదీ నీలం సంజీవరెడ్డి

ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో కౌంటింగ్ జరగలేదు.

మూలాలు

[మార్చు]
  1. http://164.100.47.5/presidentelection/7th.pdf Archived 2016-03-03 at the Wayback Machine Election Commission of India
  2. "Fakhruddin Ali Ahmed: 1905-1977 - OBITUARY". 28 February 1977. Retrieved 30 January 2022.
  3. "Shri Fakhruddin Ali Ahmed - Past President of India". Retrieved 30 January 2022.
  4. 4.0 4.1 4.2 "Background material related to Election to the office of President of India 2017". Election Commission of India. Retrieved 30 January 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]