రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ లోగల చాముండాదేవి ఆలయంలో 2008 సెప్టెంబరు 30న తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో 224 ప్రజలు మరణించారు,[3][4][5] 235 కంటే ఎక్కువ మంది క్షతగాత్రులైనారు.[6][7] 15వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం ప్రధానదేవత చాముండా దేవి.[8] ఈ దేవాలయం మెహరాంగర్ ఫోర్టు పరిథిలో ఉంది.[9]
సుమారు 25,000 మంది హిందూ యాత్రికులు నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు సందర్శించారు.[6]
ఆలయానికి వచ్చిన భక్తులు పెనుగులాట మూలంగా అచ్చటి తలుపు తెరుచుకుంది. దీని ఫలితంగా బారికేడ్లు ధ్వంసమైనాయి. అనేక మంది ప్రజలు దేవాలయ మెట్లపై ఎక్కుతున్న సందర్భంగా గాయపడ్డారు.[1]
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ దేవాలయ సమీపంలో గల మెహరాంగర్ వద్ద టెర్రరిస్టు బాంబ్ బ్లాస్టు జరుగుతున్నదని స్థానిక ప్రజల కథనాలను బట్టి ఈ భక్తులలో తొక్కిసలాట జరిగింది.[10] అయితే బి.బి.సి న్యూస్ ఛానెల్ అచ్చట గోడ కూలడం వలన తొక్కిసలాట జరిగినది అని తెలియజేసింది.[11] ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్థానికంగా బాంబ్ ప్రేలుడు జరుగున్నదనే కథనం వినడం వల్ల యాత్రికులలో తొక్కిసలాట జరిగింది.[12] మరికొంత మంది కథనం ప్రకారం పురుషుల వరుసలలో తోపులాట జరిగినదనీ, దీని ఫలితంగా కొంతమంది భక్తులు వరుసలలో తొక్కిసలాట ప్రారంభమై అది తీవ్రరూపంగా మారినదనీ తెలియజేసారు.[13]
మరొక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం దేవాలయానికి చేరుకొనే దారి ఇరుకుగా యుండడంవల్ల, ఏమైనా ప్రమాదం జరిగినచో అత్యవసరంగా బయటుకి పోవు దారులు లేనందున ఈ సంఘటన తీవ్ర రూపం దాల్చినట్లు తెలిపారు.[2]
భారతీయ సైనికదళానికి చెందిన వైద్యులు ఇచట గల క్షతగాత్రులకు వైద్యసేవలండించే ఆపరేషన్ లో పాల్గొన్నారు.[14] భారతీయ జనతాపార్టీ నాయకులు రాజనాథ్ సింగ్ బాధితులకు తక్షన సహాయమందిస్తున్నట్లు ప్రకటించారు.[15]
మృతులలో చాలామంది పురుషులే ఉన్నారు. మహిళల వరుస వేరుగా ఉండడం వలన మహిళా మరణాలు అంతగా సంభవించలేదు.[16]
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బి.సి.చందూరి, గవర్నర్ బి.ఎల్.జోషీ చాముండీ దేవి ఆలయంలో జరిగిన సంఘటనకు సానుభూతి తెలిపారు. ఖండూరి రాష్ట్రంలోని 13 జిల్లాల మెజిస్ట్రేట్లను మతమరమైన ప్రాంతాలలో ప్రత్యేక యేర్పాటు;ఉ చేయాలని సూచించారు.[13]