34వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 19 అక్టోబరు 2003 |
Highlights | |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "ఎట్ ఫైవ్ ఇన్ ది ఆఫ్టర్ నూన్" |
Lifetime achievement | "లివ్ ఉల్మాన్" |
34వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2003 అక్టోబరు 9 నుండి 19 వరకు న్యూఢిల్లీలో జరిగింది.[1] ఫెస్టివల్ డైరెక్టర్ నీలమ్ కపూర్ ఆధ్వర్యంతో ఆసియా డైరెక్టర్లు తీసిన సినిమాలతోనే ఈ ఫెస్టివల్ జరిగింది.[2] ఈ కార్యక్రమాలనికి నటుడు కమల్ హసన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు.[3][4]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]