42వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
![]() భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో | |
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | నవంబరు 30, 2011 |
Hosted by | రాహుల్ ఖన్నా టిస్కా చోప్రా |
Highlights | |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | "పోర్ఫిరియో" |
Lifetime achievement | "బెర్ట్రాండ్ టావెర్నియర్" |
42వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2011 నవంబరు 23 నుండి నవంబరు 30 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1] సినీ దర్శకుడు అడూర్ గోపాలక్రిష్ణన్ అంతర్జాతీయ పోటీ (ఫీచర్) కు అధ్యక్షత వహించగా, దర్శకుడు బసు భట్టాచార్య షార్ట్ ఫిల్మ్ పోటీకి అధ్యక్షత వహించాడు. కళా దర్శకుడు, తోట తరణి "డ్యాన్స్ నెమలి" ఫోటోతో తయారుచేసిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం పోస్టర్ ను ఈ ఫెస్టివల్ లో విడుదల చేశారు.[2][3] ఈ ఫెస్టివల్ ప్రత్యేక సినిమాగా చిత్రనిర్మాత షాజీ కరుణ్ రూపొందించబడిన “కాలిడోస్కోప్” సినిమా ప్రదర్శనకాగా, 3 డి, యానిమేషన్, యూరోపియన్ ఆవిష్కరణలు, మాస్టర్ క్లాస్ సినిమాలు, రష్యన్ క్లాసిక్స్ వంటి కొత్త విభాగాలు కొత్తగా చేర్చబడ్డాయి. ఈ ఉత్సవానికి భారత సినీ నటుడు షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.[4]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[5][6] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[7]