46వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
Presented on | 30 నవంబరు 2015 |
Hosted by | కబీర్ బేడి లిల్లెట్ దుబే |
Highlights | |
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | ఎంబ్రాస్ ఆఫ్ ది పెర్పెంట్ |
Lifetime achievement | నికితా మిఖల్కోవ్ |
46వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2015 నవంబరు 20 నుండి నవంబరు 30 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1] యుకె దర్శకుడు మైఖేల్ రాడ్‌ఫోర్డ్, పాలస్తీనాకు చెందిన ఇజ్రాయెల్ దర్శకురాలు శ్రీమతి సుహా అరాఫ్, జర్మన్ నటి జూలియా జెంట్స్, దక్షిణ కొరియా చిత్రనిర్మాత జియోన్ క్యూ-హ్వాన్ తదితరులు ఉన్న అంతర్జాతీయ జ్యూరీకి ఛైర్‌పర్సన్ శేఖర్ కపూర్ నాయకత్వం వహించాడు. 13 మంది సభ్యులున్న ఫీచర్ జ్యూరీకి చైర్‌పర్సన్ అరిబామ్ శ్యామ్ శర్మ నాయకత్వం వహించగా, 7 మంది సభ్యులున్న నాన్-ఫీచర్ జ్యూరీకి చైర్‌పర్సన్ రాజేంద్ర జంగ్లే నాయకత్వం వహించాడు.[2]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[3][4] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[5]
"ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ"
"ది క్లాన్"