48వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
48వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది 2017 నవంబరు 20 నుండి 28 వరకు గోవాలో జరిగింది. ఈ చిత్రోత్సవంలో "సెలబ్రేటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ సినిమా" పండుగ అనేది థీమ్‌గా తీసుకోబడింది. 2017 అక్టోబరు ప్రారంభంలో రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించబడ్డాయి.[1]
భారతీయ పనోరమా విభాగం జ్యూరీ హెడ్‌గా నియమితులైన సినీనిర్మాత సుజోయ్ ఘోష్, చిత్రోత్సవం నిర్వహించే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఎస్ దుర్గ, న్యూడ్ అనే రెండు సినిమాలను చిత్రోత్సవం నుండి తొలగించిందని ఆరోపిస్తూ నవంబరు 14న తన పదవికి రాజీనామా చేశాడు. ఇండియన్ పనోరమా విభాగంలో జ్యూరీచే ఎంపిక చేసినాకూడా వారిని సంప్రదించకుండా వాటిని తొలగించారు.[2][3] అపూర్వ అస్రానీ, జ్ఞాన్ కొరియా అనే మరో ఇద్దరు సభ్యులు మరుసటి రోజు జ్యూరీ నుండి వైదొలిగారు.[4]