51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్

51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది 2021 జనవరి 16 నుండి 24 వరకు గోవాలో జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ చిత్రోత్సవం హైబ్రిడ్‌గా జరిగింది, వివిధ విభాగాలలో 224 సినిమాలలో 50 సినిమాలు భౌతిక, వర్చువల్ స్క్రీనింగ్ జరిగింది.[1][2][3] ఈ చిత్రోత్సవం 'కంట్రీ ఆఫ్ ఫోకస్' విభాగంలో నాలుగు సినిమాలతో బంగ్లాదేశ్ దేశం ఉంది.[4]

2021 జనవరి 18న ఇండియన్ పనోరమా విభాగంలో నాన్-ఫీచర్ ఫిల్మ్‌లో శ్రీధర్ రూపొందించిన ఫిల్మ్ ఇన్ అవర్ వరల్డ్‌ను ప్రీమియర్ చేయడం ద్వారా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ని హైలైట్ చేసింది[1]

చిత్రోత్సవంలో 2021 జనవరి 16న ప్రారంభ, 2021 జనవరి 24న ముగింపు వేడుకలు డిడి ఇండియా, డిడి నేషనల్ ఛానల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి.[5]

నివాళి

[మార్చు]

ప్రముఖ సినీ దర్శకుడు సత్యజిత్ రే శతాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు నివాళిగా రే తీసిన క్లాసిక్ సినిమాలను ప్రదర్శించారు:[6]

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా కొన్ని సినిమాలను ప్రదర్శించారు:

విజేతలు

[మార్చు]

51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం విజేతలు:[8][9]

  • గోల్డెన్ పీకాక్ (ఉత్తమ చిత్రం) : ఇంటు ది డార్క్‌నెస్
  • వెండి నెమలి:
    • ఉత్తమ దర్శకుడు అవార్డు: చెన్-నియెన్ కో (ది సైలెంట్ ఫారెస్ట్, తైవాన్ సినిమా)
    • ఉత్తమ నటుడు అవార్డు: త్జు-చువాన్ లియు (ది సైలెంట్ ఫారెస్ట్)
    • ఉత్తమ నటి అవార్డు: జోఫియా స్టాఫీజ్ (ఐ నెవర్ క్రై, పోలిష్ సినిమా)
    • ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: కాసియో పెరీరా డాస్ శాంటోస్ (వాలెంటినా)
    • సిల్వర్ పీకాక్ స్పెషల్ జ్యూరీ అవార్డు: ఫిబ్రవరి (కామెన్ కలేవ్)
    • ప్రత్యేక ప్రస్తావన: కృపాల్ కలిత (బ్రిడ్జ్)

ప్రత్యేక అవార్డులు

[మార్చు]

అధికారిక ఎంపికలు

[మార్చు]

51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక ఎంపికలు:[10][13][14]

ప్రారంభ సినిమా

[మార్చు]
  • అనదర్ రౌండ్ (దర్శకుడు: థామస్ వింటర్‌బర్గ్, డెన్మార్క్, ఇది 2020లో ఆస్కార్‌కి డెన్మార్క్ అధికారిక ప్రవేశం పొందింది.[15]

మధ్య సినిమా

[మార్చు]
  • మెహ్రునిసా (దర్శకుడు: సందీప్ కుమార్, ఆస్ట్రియా)

ముగింపు సినిమా

[మార్చు]
  • వైఫ్ ఆఫ్ ఎ స్పై (దర్శకత్వం: కియోషి కురోసావా, జపాన్). 77వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ లయన్‌ను గెలుచుకుంది.[10]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Swati Mathur (15 January 2021). "First hybrid edition of IFFI to go live from January 16; of 224 films, nearly 50 to be available online". Times of India. Retrieved 2023-05-25.
  2. "Film Guide - 51st IFFI". IFFI. Retrieved 16 January 2021.
  3. Tushar Jadhav (15 January 2021). "51st International Film Festival of India to begin from Jan 16". News on Air: All India Radio. Archived from the original on 2021-01-28. Retrieved 2023-05-25.
  4. Tushar Jadhav (11 January 2021). "Bangladesh to be country of focus at 51st International Film Festival of India". DD News: GOI. Retrieved 2023-05-25.
  5. "51st edition of IFFI set to start in a hybrid mode for the first time: Opening Ceremony tomorrow". PIB GOI. 15 January 2020. Retrieved 2023-05-25 – via Press release.
  6. "Dhritiman Chatterjee inaugurates special segment on celebrating 100 years of Satyajit Ray at 51st IFFI".
  7. "Film fest to pay tribute to Netaji on Jan 23 - Times of India". The Times of India.
  8. "Danish film 'Into the Darkness' wins Golden Peacock award at IFFI". WION. 24 January 2021. Retrieved 2023-05-25.
  9. "51st International Film Festival of India: Winners list". Indian Express. 24 January 2021. Retrieved 2023-05-25.
  10. 10.0 10.1 10.2 Shekhar, Mimansa (16 January 2021). "IFFI 2021: Everything to know about the film festival". Indian Express.
  11. "Biswajit Chatterjee has been conferred Indian Personality of the Year Award at 51st IFFI". Times of India. 16 January 2021. Retrieved 2023-05-25.
  12. "Veteran actor Biswajit Chatterjee crowned as Indian Personality of Year at IFFI 51 Closing Ceremony".
  13. "IFFI 2020: Regional films dominate Indian Panorama line-up". Deccan Herald. 20 December 2020 – via PTI.
  14. "Indian Panorama announces official selection for 51st International Film Festival of India, 2020". PIB GOI. 19 December 2020 – via Press release.
  15. "51st International Film Festival of India in Goa from Jan 16, to open with Vinterberg's 'Another Round'". Business World. 2 January 2021 – via ANI.

బయటి లింకులు

[మార్చు]