52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2021 నవంబరు 20న గోవాలో కార్లోస్ సౌరా తీసిన ది కింగ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్ (ఎల్ రే డి టోడో ఎల్ ముండో )తో ప్రారంభమైంది. 51వ చిత్రోత్సవం మాదిరిగానే ఈ చిత్రోత్సవం కూడా భౌతిక, వర్చువల్ స్క్రీనింగ్ జరిగింది.[1][2] ఇందులో బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, భారతదేశాల నుండి సినిమాలు ప్రదర్శించబడ్డాయి. 52వ చిత్రోత్సవంలో ఈ ఐదు దేశాలు 'కంట్రీ ఆఫ్ ఫోకస్'గా ఉన్నాయి.[3]
2021 చిత్రోత్సవంలో, సత్యజిత్ రే శతజయంతి సందర్భంగా, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ 'స్పెషల్ రెట్రోస్పెక్టివ్' ద్వారా ఆయనకు నివాళులు అర్పించింది, చిత్రోత్సవంలో రే రూపొందించిన 11 సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి. అతని వారసత్వానికి గుర్తింపుగా జీవితకాల సాఫల్య పురస్కారానికి ఈ సంవత్సరం నుండి 'సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు'గా పేర్కొనబడింది.[4] ఈ చిత్రోత్సవంలో మొదటిసారిగా, స్ట్రీమింగ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, వూట్, సోనీ లీవ్ కూడా పాల్గొన్నాయి.[5]
కరణ్ జోహార్, మనీష్ పాల్ హోస్ట్ చేసిన ఈ చిత్రోత్సవ ప్రారంభ వేడుక 2021 నవంబరు 20న ఛానళ్ళలో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.[6] యూట్యూబ్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. నవంబరు 28న అస్గర్ ఫర్హాదీ తీసిన ఎ హీరో సినిమాతో చిత్రోత్సవం ముగిసింది. ముగింపు వేడుక కూడా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.