67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు |
---|
Awarded for | 2019 ఉత్తమ చిత్రాలు |
---|
Awarded by | చలనచిత్రోత్సవ డైరెక్టరేట్ |
---|
Presented by | చలనచిత్రోత్సవ డైరెక్టరేట్ |
---|
Announced on | 22 మార్చి 2021 |
---|
Presented on | 3 మే 2021 (2021-05-03) |
---|
Official website | dff.nic.in |
---|
|
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిధ భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు.
67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు 2021 మార్చి 22 న సాయంత్రం 4:00 గంటలకు ప్రకటించబడ్డాయి.[1][2] భారతీయ సినిమారంగంలో 2019లో విడుదలైన ఉత్తమ చిత్రాలను గౌరవించటానికి డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వార్షిక జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం 2020, మే 3న జరగాల్సి ఉంది. కాని కరోనా-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.[3] ఈ కార్యక్రమం 2021 మే నెల మొదటివారంలో జరుగనుంది.
చలన చిత్రోత్సవ డైరెక్టరేట్ 2020 ఫిబ్రవరి 17 వరకు ఆన్లైన్ ద్వారా ఎంట్రీలను ఆహ్వానించింది. 2019 జనవరి 1 నుండి 2019 డిసెంబరు 31 మధ్యకాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారు సర్టిఫై చేసిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్స్ ఈ 67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలకు అర్హత సాధించాయి. అలాగే భారతీయ వార్తాపత్రికలు, పత్రికలు, పత్రికలలో ప్రచురించబడిన సినిమాపై పుస్తకాలు, విమర్శనాత్మక అధ్యయనాలు, సమీక్షలు లేదా కథనాలు సినిమా విభాగంలో ఉత్తమ రచన పురస్కారానికి అర్హులు.[4]
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: రజనీకాంత్
- ఉత్తమ నటి: కంగనా రనౌత్ - మణికర్ణిక & పంగ (హిందీ)
- ఉత్తమ నటుడు: మనోజ్ వాజ్పాయి - భోంస్లే (హిందీ); ధనుష్ - అసురన్ (తమిళం)
- ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తార్ హూరైన్)
- ఉత్తమ చిత్రం: మరక్కర్ అరబిక్కడలింటే సింహం (మళయాలం)
- ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: విక్రం మోర్ (అవనే శ్రీమన్నారాయణ) - కన్నడ
- ఉత్తమ నృత్య దర్శకుడు: రాజు సుందరం - మహర్షి (తెలుగు)
- ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: సిద్ధార్థ్ ప్రియదర్శన్ - మరక్కర్ అరబిక్కడలింటే సింహం (మళయాలం)
- ప్రత్యేక బహుమతి: రాధాకృష్ణన్ పార్తీబన్ - ఒత్త సెరుప్పు సైజ్ 7 (తమిళం)
- ఉత్తమ గీత రచయిత: ప్రభా వర్మ - పాట: ఆరోడుమ్ పరయుక వయ్యా, సినిమా: కొల్లంబి (మళయాలం)
- ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమ్మాన్ - విశ్వాసం (తమిళం)
- ఉత్తమ నేపథ్య సంగీతం: ప్రభుద్ధ బెనర్జీ - జ్యేష్ఠపుత్రో (బెంగాళీ)
- ఉత్తమ ఆహార్యం: రంజిత్ - హెలెన్ (మళయాలం)
- ఉత్తమ దుస్తులు: సుజీత్ సుధాకరన్, వి. సాయి - మరక్కర్ అరబిక్కడలింటే సింహం (మళయాలం)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సునీల్ నిగ్వేకర్, నీలేష్ వాహ్ - ఆనంది గోపాల్ (మరాఠీ)
- ఉత్తమ కూర్పు: నవీన్ నూలి - జర్సీ (తెలుగు)
- ఉత్తమ సౌండ్ డిజైన్: మందర్ కలమాపుర్కర్ - త్రీజ్య (మరాఠీ)
- ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్): దెబజిత్ గయన్ - ఇవ్దుహ్ (కాశీ)
- ఉత్తమ రీరికార్డింగ్: రెసూల్ పూకుట్టి - ఒత్త సెరుప్పు సైజ్-7 (తమిళం)
- ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్: కౌశిక్ గంగూలీ - జ్యేష్ఠపుత్రో (బెంగాళీ)
- ఉత్తమ స్క్రీన్ ప్లే అడాప్టెడ్: శ్రీజిత్ ముఖర్జీ - గుమ్నామీ (బెంగాళీ)
- ఉత్తమ మాటల రచయిత: వివేక్ రంజన్ అగ్నిహోత్రి - ది తాష్కెంట్ ఫైల్స్ (హిందీ)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్ - జల్లికట్టు (మళయాలం)
- ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి - సూపర్ డిలక్స్ (తమిళం)
- ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి - ది తాష్కెంట్ ఫైల్స్ (హిందీ)
- ఉత్తమ నేపథ్య గాయని: శ్రావణి రవీంద్ర - పాట: రాన్ పేటల, సినిమా: బర్దో (మరాఠి)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: బ్రి. ప్రాక్ - పాట: తేరి మిట్టి, సినిమా: కేసరి (హిందీ)
- ఉత్తమ బాలనటుడు: నాగ విశాల్ - కడ్ కరుప్పు దురై (తమిళం)
- ఉత్తమ బాలల చిత్రం: కస్తూరి (హిందీ)
- ఉత్తమ సినీ విమర్శకులు: సోహిని ఛటోపాధ్యాయ్
- ఉత్తమ పర్యావరణ చిత్రం: వాటర్ బురియల్ (మోన్పా)
- ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం: తాజ్ మహల్ (మరాఠి)
- ఉత్తమ నూతన దర్శకుడు: మతుకుట్టి క్షవియెర్ - హెలెన్ (మళయాలం)
- ఉత్తమ వినోదం అందించిన పాపులర్ చిత్రం: మహర్షి (తెలుగు)
- ఉత్తమ సామాజిక చిత్రం: ఆనంది గోపాల్ (మరాఠి)
- ఉత్తమ రిజనల్ ఫిల్మ్స్: తెలుగు: జర్సీ, హిందీ: చిచ్చోరే, తమిళం: అసురన్, తులు: పింగర, మరాఠి: బర్దో, మలయాళం: కల్లా నొట్టం , గుజరాతీ: , ఒడియా: సాలా బుదర్ బద్లా & కలిరా అతిట, పనియ: కెంజిర, మిషింగ్: అనురువడ్, పంజాబి: రబ్ దా రేడియో, మణిపురి: ఇజికొన, కొంకణి: కాజ్రో, కన్నడ: అక్షి, బెంగాళీ: గుమ్నామీ, అస్సామీ: రోనువా - హు నెవర్ సరెండర్
- స్పెషల్ మెన్షన్: లతా భగవాన్ కరే (మరాఠి)