68వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు |
---|
Awarded for | 2020 ఉత్తమ చలనచిత్రాలు |
---|
Awarded by | చలనచిత్రోత్సవ డైరెక్టరేట్ |
---|
Presented by | చలనచిత్రోత్సవ డైరెక్టరేట్ |
---|
Announced on | 2022 జూలై 22 |
---|
Presented on | 2022 సెప్టెంబరు 30 |
---|
Official website | dff.nic.in |
---|
|
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ చలనచిత్రం | సూరయైపొట్రు |
---|
Best Non-feature Film | టెస్టిమొని ఆఫ్ అనా |
---|
Best Book | ది లాంగెస్ట్ కిస్ |
---|
Lifetime achievement | ఆశా పరేఖ్ |
---|
ఎక్కువ పురస్కారాలు | సూరయైపొట్రు (5) |
---|
|
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిధ భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు. 68వ జాతీయ చలనచిత్ర అవార్డులకు ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. 2022 జూలై 22న సాయంత్రం 4:00 గంటలకు ప్రకటించబడ్డాయి.[1][2]
చలన చిత్రోత్సవ డైరెక్టరేట్ 2021 మార్చి 12 వరకు ఆన్లైన్ ద్వారా ఎంట్రీలను ఆహ్వానించింది. 2020 జనవరి 1 నుండి 2020 డిసెంబరు 31 మధ్యకాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారు సర్టిఫై చేసిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్స్ ఈ 68వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలకు అర్హత సాధించాయి. అలాగే భారతీయ వార్తాపత్రికలు, పత్రికలు, పత్రికలలో ప్రచురించబడిన సినిమాపై పుస్తకాలు, విమర్శనాత్మక అధ్యయనాలు, సమీక్షలు లేదా కథనాలు సినిమా విభాగంలో ఉత్తమ రచన పురస్కారానికి అర్హులు.[3]
ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల విభాగాల కోసం, ఏదైనా భారతీయ భాషలోని సినిమాలు, 16 ఎంఎం, 35 ఎంఎం, ఫిల్మ్ గేజ్ లేదా డిజిటల్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడి, సినిమాల్లో, డిజిటల్ ఫార్మాట్‌లలో విడుదల చేయడానికి అర్హత పొంది ఉండాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సినిమాలు ఫీచర్ ఫిల్మ్, ఫీచర్ లేదా డాక్యుమెంటరీ/న్యూస్‌రీల్/నాన్ ఫిక్షన్ సర్టిఫికేట్ పొందాలి.
అవార్డుల ఎంపికకు జ్యూరీ సభ్యులను నియమించడం జరుగుతుంది.[4]
• చైర్‌పర్సన్: విపుల్ షా
• సభ్యులు: ధరమ్ గులాటి, శ్రీలేఖ ముఖర్జీ, జిఎస్ భాస్కర్, ఎస్. తంగదురై, సంజీవ్ రత్తన్, ఎ. కార్తీకరాజా, వి.ఎన్. ఆదిత్య, విజి తంపి, తంగదురై, నిషిగంధ.
బెస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్
[మార్చు]
రాష్ట్ర ప్రభుత్వ విధానం ద్వారా సినిమాని ఒక కళారూపంగా అధ్యయనం చేయడం, ప్రశంసించడం, సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఈ కళారూపానికి విమర్శనాత్మక ప్రశంసలను ప్రోత్సహించడం వంటి అంశాలలో ఈ అవార్డు అందించబడుతోంది.
బెస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: మధ్యప్రదేశ్[5]
- ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరయైపొట్రు)
- ఉత్తమ నటుడు: సూర్య (సూరయైపొట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ)
- ఉత్తమ దర్శకుడు: కె. ఆర్. సచ్చిదానందన్ (అయ్యప్పమ్ కోషియమ్)
- ఉత్తమ చిత్రం: సూరయైపొట్రు
- ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: అయ్యప్పనుమ్ కోషియమ్
- ఉత్తమ నృత్య దర్శకుడు: నాట్యం (తెలుగు)
- ఉత్తమ డ్యాన్సర్: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)
- ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్:
- ప్రత్యేక బహుమతి: వాంకు (మలయాళం), జూన్ (మరాఠీ), గోడకాత్ (మరాఠీ), తులసీదాస్ (హిందీ)
- ఉత్తమ గీత రచయిత: మనోజ్ మౌతషిర్ (సైనా)
- ఉత్తమ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. తమన్ (అల వైకుంఠపురములో)
- ఉత్తమ నేపథ్య సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ (సూరయైపొట్రు)
- ఉత్తమ ఆహార్యం: టివి రాంబాబు (నాట్యం- తెలుగు)
- ఉత్తమ దుస్తులు: నచికేట్ బర్వే, మహేష్ షేర్లా (తానాజీ)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీస్ నాడోడి (కప్పెల - మలయాళం)
- ఉత్తమ కూర్పు: శ్రీకర్ ప్రసాద్ (శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్-తమిళం)
- ఉత్తమ సౌండ్ డిజైన్: అన్మూల్ భావే (మీ వసంతరావు- మరాఠీ)
- ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్): జాబిన్ జయన్ (డోలు- కన్నడ)
- ఉత్తమ రీరికార్డింగ్ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్): విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మలిక్- మలయాళం)
- ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్: సుధా కొంగర, షాలినీ ఉషాదేవి (సూరయైపొట్రు)
- ఉత్తమ మాటల రచయిత: మడోన్ అశ్విన్ (మండేలా)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతీమ్ భోల్ (అవిజాత్రిక్- బెంగాలీ)
- ఉత్తమ సహాయ నటుడు: బిజుమీనన్ (అయ్యప్పమ్ కోషియమ్)
- ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
- ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పమ్ కోషియమ్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్‌పాండే (మీ వసంతరావు - మరాఠీ)
- ఉత్తమ బాలనటుడు: అనీష్ మంగేశ్ గోసావి (టక్ టక్- మరాఠీ), ఆకాంక్ష పింగ్లే, దివఏశ్ ఇందుల్కర్ (సుమీ- మరాఠీ)
- ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి)
- ఉత్తమ సినీ విమర్శకులు:
- ఉత్తమ పర్యావరణ చిత్రం: తలేదండ
- ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం:
- ఉత్తమ నూతన దర్శకుడు: మడోన్ అశ్విన్ (మండేలా)
- ఉత్తమ వినోదం అందించిన పాపులర్ చిత్రం: తానాజీ
- ఉత్తమ సామాజిక చిత్రం: జస్టిస్ డిలేయ్డ్ బట్ డెలివర్డ్ (హిందీ), 3 సిస్టర్స్ (బెంగాలీ)
- ఉత్తమ రిజనల్ ఫిల్మ్స్: తెలుగు: కలర్ ఫోటో, హిందీ: తులసీదాస్ జూనియర్, తమిళం: శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్, తులు: జీతిగే,[6] మరాఠి: గోష్ట ఏక పైథానిచి, మలయాళం: తింకలఙ్చ నిశ్చయమ్, కన్నడ: డొల్లు, బెంగాళీ: అవిజాట్రిక్, అస్సామీ: బ్రిడ్జి, హర్యాన్వి: ధనలక్ష్మీ,[7] ధింసా: సెమ్‌ఖోర్.[8]
- ఉత్తమ వాయిస్ ఓవర్: శోభా రాప్సోడీ ఆఫ్ రెయిన్స్- మాన్‌సూన్స్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్)
- ఉత్తమ సంగీతం: విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ: మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ)
- ఉత్తమ కూర్పు: అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్)
- ఉత్తమ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్- సందీప్ భాటి, ప్రదీప్ లెహ్వార్ (జాదూయ్ జంగల్) (హిందీ)
- ఉత్తమ ఆడియోగ్రఫీ (ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్): అజిత్ సింగ్ రాథోడ్ (పర్ల్ ఆఫ్ ద డిసర్ట్ ) (రాజస్థానీ)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: నిఖిల్ ఎస్ ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం)
- ఉత్తమ దర్శకత్వం: ఆర్‌వీ రమణి (ఓ దట్స్ భాను- ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ)
- ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్ (మరాఠి)
- ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిల్మ్: కచీచినుతు (అస్సాం)
- స్పెషల్ జ్యూరీ అవార్డు: అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్)
- ఉత్తమ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్: ద సేవియర్: బ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ)
- ఉత్తమ ఎక్స్‌ప్లోరేషన్ ఫిల్మ్: వీలింగ్ ద బాల్ (ఇంగ్లీష్, హిందీ)
- ఉత్తమ ఎడ్యుకేషనల్ ఫిల్మ్: డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ (మలయాళం)
- ఉత్తమ పర్యావరణ చిత్రం: మాన అరు మానుహ్ (అస్సామీస్)
- ఉత్తమ ప్రమోషనల్ ఫిల్మ్: సర్‌మొంటింగ్ చాలెంజెస్ (ఇంగ్లీష్)
- ఉత్తమ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిల్మ్: ఆన్ ద బ్రింక్ సీజన్ 2- బ్యాట్స్ (ఇంగ్లీష్)
- ఉత్తమ కళా, సాంస్కృతిక చిత్రం: నాదదా నవనీతా
- ఉత్తమ జీవితకథాచిత్రం: పబుంగ్ శ్యామ్
- ఉత్తమ ఎత్నోగ్రాఫిక్ ఫిల్మ్: మందల్ కె బోల్ (హిందీ)
- ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: విశేష్ అయ్యర్ (పరాయా- మారాఠీ, హిందీ)