99 సాంగ్స్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | విశ్వేష్ కృష్ణమూర్తి |
స్క్రీన్ ప్లే | విశ్వేష్ కృష్ణమూర్తి (డైలాగ్స్) -- హుస్సేన్ దలాల్ (హిందీ) గౌతమ్ మీనన్ (తమిళం) కిరణ్ (తెలుగు) |
కథ | ఎ. ఆర్. రెహమాన్ విశ్వేష్ కృష్ణమూర్తి |
నిర్మాత | ఎ. ఆర్. రెహమాన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | తనయ్ జేమ్స్ కౌలీ |
కూర్పు | అక్షయ్ మెహతా శ్రేయాస్.బి |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు | ఐడియల్ ఎంటర్‌టైన్‌మెంట్ వై.ఎమ్.మూవీస్ |
పంపిణీదార్లు | జియో స్టూడియోస్ |
విడుదల తేదీs | 10 అక్టోబరు 2019 (బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్) 16 ఏప్రిల్, 2021 (భారతదేశం) |
సినిమా నిడివి | 178 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
99 సాంగ్స్, 2021లో విడుదలైన హిందీ సినిమా. వై.ఎమ్.మూవీస్ బ్యానర్ పై సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తొలిసారి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.[1] ఈ సినిమా 2021 ఏప్రిల్ 16న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడులైంది.[2]
జయ్ (ఇహాన్ భట్) కు సంగీతమంటే ప్రాణం. అది జీవితాన్ని నాశనం చేస్తుందని, దాని జోలికి పోవద్దు అని అతని తండ్రి చెప్పినా... ఆయనకు తెలియకుండానే సంగీత సాధన చేస్తాడు జయ్. ఒక్క పాట ప్రపంచాన్ని మార్చేస్తుందని ప్రగాఢంగా నమ్మే జయ్, వ్యాపారవేత్త సంజయ్ సింఘానియా (రంజిత్ బారోట్) కుమార్తె సోఫియా (ఎడిల్సీ వార్గాస్) తో ప్రేమలో పడతాడు. మూగమ్మాయి అయిన సోఫియాకు తన కోసం పాటలు రాసి, పాడే జయ్ అంటే ప్రేమ. అయితే ఆమె తండ్రి మాత్రం ఓ స్ట్రగులింగ్ మ్యూజీషియన్ కి కూతురును ఇచ్చి పెళ్ళి చేయడానికి ఇష్టపడడు. 'ఒక్క పాట కాదు సమాజాన్ని ప్రభావితం చేయగల వంద పాటలు తయారు చేసుకురమ్మని జయ్ కు ఛాలెంజ్ విసురుతాడు. దానిని స్వీకరించిన జయ్ తన స్నేహితుడు పోలో (టెంజిన్ దల్హా) తో కలిసి షిల్లాంగ్ వెళతాడు. షిల్లాంగ్‌లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్ కేసులో జయ్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అక్కడ జాజ్ సింగర్ షీలా (లీసారే) పరిచయం కావడంతో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. మరి జయ్ చేసిన ఛాలెంజ్ ఏమైంది? అసలు అతని తండ్రికి సంగీతమంటే ఎందుకు ద్వేషం? ఒక్క పాటతో ప్రపంచాన్ని మార్చొచ్చు అన్న జయ్ ఆశయం నెరవేరిందా? అన్నదే సినిమా కథ.[3]