అంకుర్ భాటియా | |
---|---|
జననం | భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం | 1980 మే 24
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
అంకుర్ భాటియా (జననం 1980 మే 24) భారతీయ నటుడు, మోడల్. ఆయన 2010లో మీరా నాయర్ నిర్మించిన పాయల్ సేథి గ్రాంట్ సెయింట్ షేవింగ్ కోతో అరంగేట్రం చేసాడు. 2012లో, ఆయన కోకోనట్ గ్రోవ్ కోసం న్యూయార్క్ విశ్వవిద్యాలయం (NYU) టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి ప్రశంసా పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 2013లో, ఆయన బాలీవుడ్ చిత్రం జంజీర్, తెలుగు రీమేక్‌లో తూఫాన్ లో ప్రతికూల పాత్రను పోషించాడు.[1]
ఆయన శ్రద్ధా కపూర్ నటించిన అపూర్వ లఖియా సినిమా హసీనాలో నటించాడు, ఇది 2017 ఆగస్టు 18న థియేటర్లలో విడుదలైంది. 2020లో, రామ్ మాధ్వాని దర్శకత్వం వహించి, సుస్మితా సేన్ నటించిన డిస్నీ+ హాట్‌స్టార్ షో ఆర్య (ఇండియన్ టీవీ సిరీస్)లో ఆయన కీలక పాత్ర పోషించాడు.
అంకుర్ భాటియా భోపాల్‌లో 1980 మే 24న జన్మించాడు. ఆయన గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లాడు. అక్కడ అగ్రశ్రేణి కన్సల్టింగ్ సంస్థలకు యాక్చురీ(Actuary)గా పనిచేశాడు. ఆ తరువాత, చిన్నప్పటి నుంచి నటుడిగా ఎదగాలనే తపనతో నటన వైపు మళ్లాడు. ఫిలిం మేకింగ్ అండ్ యాక్టింగ్ కోర్సు ఆయన న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి పూర్తిచేసాడు.
సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2010 | రెండర్డ్ | రియాజ్ | |
గ్రాంట్ సెయింట్ షేవింగ్ కో. | బంటి | ||
2011 | కమింగ్ హోమ్ | ప్రేమికుడు | |
కోకనట్ గ్రోవ్ | రాజ్ | ||
2012 | ఎ డర్టీ బిజినెస్ | దేవ్ కోహ్లీ | |
2013 | జంజీర్ | బోస్కో | |
2016 | సర్బ్జిత్ | బలదేవ్ | |
2017 | హసీనా పార్కర్ | ఇబ్రహీం పార్కర్ | |
2021 | భావాయి | ||
2021 | లబ్ద్ | శ్రీకాంత్ బసు | |
2023 | బ్లడీ డాడీ | విక్రమ్ చౌదరి | జియో సినిమా |
2023 | ఆపరేషన్ మేఫెయిర్ | TBA |
సంవత్సరం | ధారావాహిక | పాత్ర | ఛానల్ | నోట్స్ |
---|---|---|---|---|
2020 | ఆర్య | సంగ్రామ్ సింగ్ | హాట్‌స్టార్ | |
క్రాక్ డౌన్ | తారిఖ్ | ఊట్ | ||
2023 | తాలీ | జియో సినిమా | [2] |
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)