అంకుశం (1990 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
తారాగణం | డాక్టర్ రాజశేఖర్, జీవిత, రామిరెడ్డి, నీలకంఠం |
సంగీతం | సత్యం |
నిర్మాణ సంస్థ | ఎమ్.ఎస్.ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
అంకుశం సెప్టెంబరు 28, 1990 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా. రాజశేఖర్, జీవిత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడు రామిరెడ్డి సినీ రంగ ప్రవేశం చేశాడు. ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసరు అవినీతి పరులైన గూండాల నుంచి రాష్ట్రాన్ని రక్షించడం ప్రధాన కథ.
విజయ్ ఒక నిజాయితీ గల పోలీస్ ఇన్‌స్పెక్టరు. విజయ్ కు గతంలో మార్గదర్శకుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన రాఘవయ్యను చంపడానికి నీలకంఠం అనే రౌడీ చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుంటాడు. అతన్ని ఆపడానికి విజయ్ ఏం చేశాడన్నది మిగతా చిత్ర కథ.
ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. రాజశేఖర్ కెరీర్ కు మంచి ఊపు నిచ్చింది. ఆవేశం కలిగిన పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ చూపించిన నటన పలువురి ప్రశంసలు అందుకుంది. తర్వాత ఇలాంటి పాత్రలు చాలా చేశాడు. అయితే ఇదే దర్శకుడు, కథానాయకుడు కలయికలో వచ్చిన నాయకుడు చిత్రం పరాజయం పాలైంది.[1] ప్రతినాయకుడుగా నటించిన రామిరెడ్డి కూడా తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు.
పాటల రచయిత: మల్లెమాల సుందర రామిరెడ్డి.