అంజలి ఆనంద్ | |
---|---|
జననం | ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కుల్ఫీ కుమార్ బజేవాలా, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ |
అంజలి ఆనంద్ భారతీయ నటి, ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేస్తుంది. స్టార్ ప్లస్ యొక్క టెలివిజన్ షోలైన ధై కిలో ప్రేమ్, కుల్ఫీ కుమర్ర్ బజేవాలా వంటి ప్రధాన పాత్రల ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది, ఇవి ఆమెకు పెద్ద గుర్తింపును సంపాదించాయి. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ధర్మా ప్రొడక్షన్స్ చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఆమె హిందీ చిత్రరంగ ప్రవేశం చేసింది.
అంజలి 2017 వెబ్ సిరీస్ అన్టాగ్తో తన నటనా రంగ ప్రవేశం చేసింది.[1] ఆమె స్టంట్ ఆధారిత రియాలిటీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి సీజన్ 13లో కూడా పోటీదారుగా కనిపించింది.[2][3]
అంజలి ఆనంద్ మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఈమె మాజీ నటుడు దినేష్ ఆనంద్ కుమార్తె.[4]
అంజలి ఆనంద్ 2017లో అన్ ట్యాగ్ అనే వెబ్ సిరీస్తో తన నటనా రంగ ప్రవేశం చేసింది.[5]
2017లో ధాయ్ కిలో ప్రేమ్, 2018లో కుల్ఫీ కుమార్ బాజేవాలా అనే టెలివిజన్ షోలలో అంజలి ప్రధాన పాత్ర పోషించింది.
2023లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 13లో అంజలి కంటెస్టెంట్గా పాల్గొన్నది.[6] 2023లో కరణ్ జోహార్ తెరకెక్కించిన రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.[7] డాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జా (సీజన్ 11)లో కూడా పాల్గొన్న ఆమె 11 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యింది. [8]
సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2017 | ధాయ్ కిలో ప్రేమ్ | దీపికా శర్మ | [9] | |
2017 | ఆన్ ట్యాగ్ | శిఖా సూరి | [10] | |
2018–2020 | కుల్ఫీ కుమార్ బాజేవాలా | లవ్లీన్ చద్దా సింగ్ గిల్ | [11] | |
2023 | ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రోన్ కే ఖిలాడి 13 | కంటెస్టెంట్ | 12వ స్థానం | [12] |
2023–2024 | ఝలక్ దిఖ్లా జా 11 | కంటెస్టెంట్ | 10వ స్థానం | [13] |
సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2021 | బెల్ బాటమ్ | అన్షుల్ సోదరి | ||
2023 | రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ | గాయత్రి రంధావా | [14] | |
2024 | బన్ టిక్కి | [15] |