అంజలీ మీనన్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | లండన్ ఫిల్మ్ స్కూల్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | వినోద్ మీనన్ |
పిల్లలు | 1 |
అంజలీ మీనన్ ప్రముఖ భారతీయ సినీ దర్శకురాలు, సినీ రచయిత్రి. మలయాళ చిత్రం మంజదికురు సినిమాతో దర్శకురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఆమె. ఈ సినిమాకు అంజలి అంతర్జాతీయ ఫిలిం క్రిటిక్ ఫెడరేషన్ నుండి ఉత్తమ మలయాళ చిత్రం, ఉత్తమ భారతీయ తొలి చిత్రం పురస్కారాలు అందుకున్నారు అంజలి.[2] ఆమె రెండో చిత్రం బెంగుళూర్ డేస్ మంచి హిట్ అయింది. ఆ తరువాత ఉస్తాద్ హొటల్ సినిమాకు రచన చేశారు ఆమె. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయంగా నిలవడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఆమె దుబాయ్లో పెరిగారు. పూణె విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు ఆమె.[3] 2003లో లండన్ ఫిలిం స్కూల్ లో డిగ్రీ చేసిన అంజలి, ఎడిటింగ్, నిర్మాణం సినీ దర్శకత్వ శాఖల్లో డిస్టింక్షన్ హానర్ పొందారు.[4][5] ఆమె గ్రాడ్యుయేషన్ సమయంలో రేజ్ కెంప్టన్, అర్చే పంజాబీలతో, ఆసిఫ్ కపాడియా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా తీసిన బ్లాక్ నార్ వైట్ చిత్రం పాం స్ప్రింగ్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది.[6]
భారతదేశం, మధ్య ఆసియా, యుకెలలో షార్ట్ ఫిక్షన్, డాక్యుమెంటరీ ప్రాజెక్టులతో తన కెరీర్ ను ప్రారంభించారు అంజలీ. 2006లో ముంబైలో వినోద్ మీనన్ తో కలసి లిటిల్ ఫిలింస్ ఇండియా పేరుతో ఫిలిం కంపెనీ మొదలుపెట్టారు.[4] ఆమె స్క్రీన్ ప్లే రచయితగానే కాక కథానికలు కూడా రాశారు. మాన్ సూన్ ఫీస్ట్ అనే కథానికల సంకలనంలో ఆమె కథ ఒకటి ప్రచురితమైంది. ఆమె భర్త, కొడుకుతో పాటు ముంబైలో నివసిస్తున్నారు అంజలి.
ఏడాది | సినిమా | Director | Screenwriter | Ref. |
---|---|---|---|---|
2009 | కేరళా కేఫ్(హ్యాపీ జర్నీ సిగ్మెంట్) | [7] | ||
2012 | మంజదికురు | [8] | ||
2012 | ఉస్తాద్ హోటల్ | [9] | ||
2015 | బెంగుళూర్ డేస్ | [10] |