అంజోరి అలగ్ | |
---|---|
జననం | అంజోరి అలగ్ |
ఇతర పేర్లు | అంజోరి సునీల్ అలగ్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2007–2014 |
తల్లిదండ్రులు |
|
అంజోరి అలగ్ ఒక మాజీ భారతీయ నటి, మోడల్. ఆమె నటి మాయా అలగ్, సునీల్ అలగ్ దంపతుల కుమార్తె. ఆమె 4 సంవత్సరాల వయస్సులో ఒక వాణిజ్య ప్రకటనలో మొదటిసారి కనిపించింది. ఆమె తొలి చిత్రం విక్రమ్ భట్ రూపొందించిన లైఫ్ మే కభీ కభీ (2007). ఆమె శిక్షణ పొందిన కథక్ నర్తకి.[1]
పంజాబ్ లూధియానాలో ఆమె ఒక పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి మాయా అలగ్ ప్రముఖ బాలీవుడ్ క్యారెక్టర్ నటి, ఆమె తండ్రి సునీల్ అలగ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ). అంజోరి కి సవారి అనే సోదరి కూడా ఉంది, ఆమె సమీర్ నాయర్ (ఎన్డీటీవీ సీఈఓ) ను వివాహం చేసుకుంది.
అంజోరి అలగ్ నాలుగు సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించి, ప్రహ్లాద్ కక్కర్ తో కలిసి మ్యాగీ, కొడక్ వంటి అనేక ప్రకటనలు చేసింది. 10 సంవత్సరాల వయస్సులో, ఆమె తన చదువును పూర్తి చేయడానికి నటనను విడిచిపెట్టింది. ఆమె ఒహియో ఎకనామిక్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చదవడానికి అమెరికా వెళ్ళింది. ఆమె తన చదువును పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చి, కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందింది. ఆమె తల్లి తన కెరీర్ ప్రారంభంలో మార్గనిర్దేశం చేసి, ఆమెను చిత్రనిర్మాత విక్రమ్ భట్ కు పరిచయం చేసింది. ఆయన తన చిత్రం లైఫ్ మే కభీ కభీ లో ఒక పాత్రను ఆమెకు ఆఫర్ చేశాడు. ఆమె నటనతో ఆకట్టుకున్న ఆయన, 2008లో తన తదుపరి చిత్రం 1920లో ఆమెను మళ్లీ నటింపజేసాడు, ఇది బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయం సాధించింది. అంజోరి ఎన్డిటివి ఇమాజిన్ సీరియల్ సీతా ఔర్ గీతాలో కూడా నటించింది.
షినిమా
సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2007 | లైఫ్ మే కభీ కభీ | ఇషితా శర్మ | బాలీవుడ్ ఎంట్రీ |
2008 | 1920 | గాయత్రి | హిందీ |
2008 | 1920 | గాయత్రి | డబ్బింగ్ వెర్షన్ (తెలుగు) |
2009 | ఫేమ్ | ఆంగ్లం | |
2014 | మంజునాథ్ | సుజాత |
సంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానల్ | గమనిక |
---|---|---|---|---|
2009 | సీతా ఔర్ గీతా | సీత/గీతా | ఇమెజిన్ | ద్విపాత్రాభినయం |