అంతరీన్ | |
---|---|
దర్శకత్వం | మృణాళ్ సేన్ |
రచన | సాదత్ హసన్ మాంటో (కథ), మృణాళ్ సేన్ (స్క్రీన్ ప్లే) |
నిర్మాత | భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్ధ, దూరదర్శన్[1] |
తారాగణం | అంజన్ దత్, [[డింపుల్ కపాడియా]] |
ఛాయాగ్రహణం | శశి ఆనంద్ |
సంగీతం | శశి ఆనంద్ |
విడుదల తేదీ | 1993 |
సినిమా నిడివి | 91 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ భాష |
అంతరీన్ 1993లో మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన బెంగాళీ చలనచిత్రం. సాదత్ హసన్ మాంటో రచించిన బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో అంజన్ దత్, [[డింపుల్ కపాడియా]] నటించారు.[2][3] 1993 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ) విభాగంలో బహుమతిని అందుకుంది.[1] విక్రమ్ (1986-తమిళం) తరువాత డింపుత్ కపాడియా నటించిన రెండవ పరభాష చిత్రం ఇది.
కలకత్తాలోని స్నేహితుని పాత భవనంలో ఒంటరిగా జీవిస్తున్న యువ రచయిత (అంజన్ దత్త)కు అనుకోకుండా ఒక రాత్రి ఫోన్లో ఒక వివాహితతో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ తమ జీవితాలను గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు. అలా కొద్దిరోజుల్లోనే వారిమధ్య స్నేహం పెరుగుతుంది. అనుకోకుండా ఒకరోజు రైలు ప్రయాణంలో కలుస్తారు. అతను ఆమెను పలకరిస్తాడు. అతని మాటలద్వారా తాను రోజు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి అని ఆమె గుర్తిస్తుంది. అంతలో తాను దిగాల్సిన ఊరు రావడంతో రైలు దిగి వెళ్ళిపోతుంది.