ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
వ్యవథి | 5 రోజులు |
---|---|
తేదీ | 4-8, ఫిబ్రవరీ 2014 |
వేదిక | తూర్పు నావికా దళం |
ప్రదేశం | విశాఖపట్నం, భారతదేశం |
భౌగోళికాంశాలు | 17°41′45″N 83°16′51″E / 17.695811°N 83.280709°E |
ఇలా కూడా అంటారు | IFR 2016 |
పోషకులు | భారత ప్రభుత్వం |
నిర్వాహకులు | భారత నావికా దళం |
పాలుపంచుకున్నవారు | 52 దేశాల నావికాదళాలు [1][2] |
వీడియో ప్రకటన | IFR 2016 Theme Song on Youtube |
పత్రిక ప్రకటన | GWAW15001898_IFR Press Ad |
ప్రచురణ | Ahoy IFR 2016 |
వెబ్‌సైటు | IFR 2016 Indian Navy Official |
అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష 2016 (IFR) భారతదేశ సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని తరుపున భారత నావికా దళం నిర్వహిస్తున్న ఒక సైనిక విన్యాసం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు పొరుగు దేశాలతో విశ్వాసం పెంపొందించుకోవడమే ఈ నావికాదళ విన్యాసాల లక్ష్యం. దేశప్రతిష్ఠ ప్రతిభింబించే విధంగా ఈ విన్యాసాల్లో భారత నావికా దళం పాల్గొనడానికి తయారు అవుతుంది.[3]
తొలిసారిగా భారత తూర్పు నావికాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు వేదికైంది. మునుపటి అంతర్జాతీయ యుద్ధనౌక ప్రదర్శన భారత నేవీ ముంబై వద్ద జనవరి 2011 లో నిర్వహించింది. ఈ ప్రదర్శన 4 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరుకు పెద్ద ఎత్తున విశాఖపట్నంలో జరగనుంది.
అంతర్జాతీయ యుద్దనౌకల సమీక్షలో భాగంగా విన్యాసాల నమూనా ప్రదర్శన నిర్వహించనున్నారు.[4] దీనిలో భాగంగా 'ఫ్లై పాస్ట్'ను కూడా నిర్వహిస్తున్నారు. సమీక్ష జరగడానికి ముందు భారత నౌకాదళ వాయుసేన విభాగానికి చెందిన పలు యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, వివిధ రకాల హెలికాప్తర్లు, హాక్లు, మిగ్లు తదితర విమానాలు ఆకాశం నుంచి గౌరవ వందనం సమర్పిస్తాయి. సముద్రంలో మెరైన్ కమాండోల విన్యాసాలు కూడా నిర్వహించబడ్డాయి.
ఈ కర్యక్రమానికి త్రివిధ దళాల ఉన్నతాధికారులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పలువురు విదేశీ అతిథులు హాజరు కావటంతో పటిష్ఠ భద్రత, గాలింపు చర్యలు కేటాయించబడ్డాయి. హోటళ్లు, సాగరతీర భవంతులు, వాహన తనిఖీ జరిగాయి. విహంగవీక్షణ ఛాయాచిత్రాలు, వీడియోలు (ఏరియల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ) చిత్రీకరణకు ఉపయోగపడే డ్రోన్లు నిషేధించబడ్డాయి. దుర్వినయోగ సామర్థ్యం కలిగిన సాంకేతిక పరిజ్ఞానంపై నిషేధం విధించారు. [5]