అంతహీన్ | |
---|---|
దర్శకత్వం | అనిరుద్ధ రాయ్ చౌదురి |
రచన | శ్యామల్ సేన్‌గుప్తా రంజన్ ఘోష్ (స్క్రిప్టింగ్ అసిస్టెంట్) |
నిర్మాత | జీత్ బెనర్జీ అనిరుద్ద రాయ్ చౌదరి ఇంద్రాణి ముఖర్జీ నేహా రుంగ్తా |
తారాగణం | రాధిక ఆప్టే రాహుల్ బోస్ మీతా వశిష్త్ అపర్ణా సేన్ కళ్యాణ్ రే షర్మిలా ఠాగూర్ |
ఛాయాగ్రహణం | అభిక్ ముఖోపాధ్యాయ |
కూర్పు | అర్ఘ్యకమల్ మిత్ర |
సంగీతం | శాంతను మొయిత్రా |
పంపిణీదార్లు | ముంబై మంత్ర |
విడుదల తేదీs | 23 జనవరి, 2009 |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
అంతహీన్, 2009 జనవరి 23న విడుదలైన బెంగాలీ సినిమా. అనిరుద్ధ రాయ్ చౌదురి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక ఆప్టే, రాహుల్ బోస్, మీతా వశిష్త్, అపర్ణా సేన్, కళ్యాణ్ రే, షర్మిలా ఠాగూర్ తదితరులు నటించారు.[1] 2008లో జరిగిన 56వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ (అభిక్ ముఖోపాధ్యాయ్), జాతీయ ఉత్తమ పాటల రచయిత (అనింద్య ఛటర్జీ, చంద్రిల్ భట్టాచార్య), ఉత్తమ నేపథ్య గాయని (శ్రేయ ఘోషాల్) విభాగాలలో పురస్కారాలు వచ్చాయి.
పరిమిత బడ్జెట్‌తో కోల్‌కతాలో ఈ సినిమాను తీశారు. రాహుల్ బోస్, షర్మిలా ఠాగూర్ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించగా, సంగీత దర్శకుడు శాంతను మొయిత్రా కూడా డబ్బులు తీసుకోలేదు. నోరా ఎఫ్రాన్ 1998లో తీసిన యు హావ్ గాట్ మెయిల్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాకి ఇది రీమేక్.[2]