అంతిమ్ పంఘల్ (ఆంగ్లం: Antim Panghal) హర్యానాలోని హిసార్‌కు చెందిన ఒక భారతీయ మహిళా రెజ్లర్.[1] ఆమె ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో రజత పతకాన్ని గెలుచుకుంది.[2] ఆమె భారతదేశం మొట్టమొదటి U-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్.[3][4] బ్యాక్-టు-బ్యాక్ U20 వరల్డ్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా కూడా ఆమె అవతరించింది.[5]