అక్షర | |
---|---|
దర్శకత్వం | బి. చిన్ని కృష్ణ |
రచన | బి. చిన్ని కృష్ణ |
నిర్మాత | అల్లూరి సురేష్ వర్మ బెల్లంకొండ అహితేజ |
తారాగణం | నందిత శ్వేత శకలక శంకర్ |
ఛాయాగ్రహణం | నాగేష్ బానెల్ |
కూర్పు | గిడుతూరి సత్య |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థ | సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీs | 26 ఫిబ్రవరి, 2021[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అక్షర, 2021 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.[2][3] సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో అల్లూరి సురేష్ వర్మ, బెల్లంకొండ అహితేజ నిర్మించిన ఈ సినిమాకి బి. చిన్ని కృష్ణ దర్శకత్వం వహించాడు.[4] ఈ సినిమాలో నందిత శ్వేత, శకలక శంకర్ తదితరులు నటించగా,[5] సురేష్ బొబ్బిలి సంగీతం స్వరపరిచాడు.
2018, నవంబరు 17న సినిమా ముహూర్తం షాట్ జరిగింది. 2019, ఫిబ్రవరి నెలలో చిత్రీకరణ పూర్తయింది.[7][8] 2019, జూన్ 20న టీజర్ విడుదలైంది.[9] తరువాత వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమై 2019, అక్టోబరులో విడుదలకు సిద్ధమయింది.[10] కానీ మళ్ళీ, సినిమా విడుదల వాయిదా పడింది.
ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అసురులాడరా (రచన: చైతన్య ప్రసాద్)" | చైతన్య ప్రసాద్ | అనురాగ్ కులకర్ణి, అదితి భావరాజు | 4:20 |
2. | "ప్రేమ దేశమా (రచన: బాలాజీ)" | బాలాజీ | అనుదీప్ దేవ్ | 3:42 |
2019, అక్టోబరు నెలలో విడుదల చేయనున్నట్లు 2019, సెప్టెంబరు 5న ఒక ప్రకటన వచ్చింది.[11] 2021, ఫిబ్రవరి 26న విడుదలయింది.[12]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)