అఖిల భారతీయ రామ రాజ్య పరిషత్ | |
---|---|
స్థాపకులు | స్వామి కరపత్రి |
స్థాపన తేదీ | 1948 |
రద్దైన తేదీ | 1971 |
రాజకీయ విధానం | హిందూత్వ, హిందూ జాతీయవాదం, సాంస్కృతిక జాతీయవాదం, |
అఖిల భారతీయ రామ రాజ్య పరిషత్ (RRP, "ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ రామా కింగ్‌డమ్") అనేది 1948లో స్వామి కరపత్రి స్థాపించిన భారతీయ హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ. RRP జాతీయ పార్లమెంటుకు 1952 ఎన్నికలలో మూడు లోక్‌సభ స్థానాలను, 1962లో రెండు స్థానాలను గెలుచుకుంది. 1952, 1957, 1962లలో, అనేక విధానసభ స్థానాలను కూడా గెలుచుకుంది, ఇందులో ఎక్కువగా రాజస్థాన్ స్థానాలు ఉన్నాయి. ఇతర హిందుత్వ ఆధారిత పార్టీల వలె, RRP భారతదేశంలో హిందూ కోడ్ బిల్లుల అమలుకు వ్యతిరేకంగా పోరాడింది. ఆ పార్టీ చివరికి భారతీయ జనతా పార్టీ కి పూర్వగామి అయిన జనసంఘ్ లో విలీనమైంది.[1][2][3]