అఖిల్ మిశ్రా | |
---|---|
జననం | కాన్పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1965 జూలై 22
మరణం | 2023 సెప్టెంబరు 19 | (వయసు 58)
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1983–2023 |
జీవిత భాగస్వామి | మంజు మిశ్రా (m. 1983-1996) |
అఖిల్ మిశ్రా (1965 జూలై 22 - 2023 సెప్టెంబరు 19) భారతీయ సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన హజారోన్ ఖ్వైషీన్ ఐసి, గాంధీ, మై ఫాదర్, ప్రధానమంత్రి వంటి టెలివిజన్ ధారావాహికలలో నటించాడు.[1] ఆయన దో దిల్ బంధే ఏక్ డోరీ సే అనే సీరియల్‌లో కూడా చేసాడు.[2] ఆయన 3 ఇడియట్స్‌లో లైబ్రేరియన్ దూబే క్యామియో రోల్ చేయడం, ఉత్తరాన్‌లో ఉమేద్ సింగ్ బుందేలా పాత్రను చేయడం ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఆయన భోపాల్: ఎ ప్రేయర్ ఫర్ రెయిన్‌లో కూడా నటించాడు.[3]
1983లో తన మొదటి చలనచిత్రం ధత్ తేరే...కి. ఇందులోనూ గృహలక్ష్మి కా జిన్ అనే సీరియల్‌లో తనతో కలిసి నటించిన మంజు మిశ్రాను వివాహం చేసుకున్నాడు. ఆమె 1996లో మరణించింది.[4] ఆయన ధత్ తేరే...కి చిత్రంలో నటుడిగానే కాక రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
ఆ తరువాత 2009 ఫిబ్రవరి 3న జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ ను 2011 సెప్టెంబరు 30న తిరిగి వివాహం చేసుకున్నాడు.[5][6] ఆయన ఆమెతో కలిసి క్రమ్ సినిమా, సీరియల్ మేరా దిల్ దేవానా (దూరదర్శన్) నటించాడు. 2019లో వారు "మజ్ను కి జూలియట్" అనే షార్ట్ ఫిల్మ్‌ని చిత్రీకరించారు, దీనికి ఆయనే రాసి, నటించి, దర్శకత్వం వహించాడు.
ఆయన తల్లి అరుంధతీ మిశ్రా అక్టోబరు 2012లో మరణించింది.
58 సంవత్సరాల వయస్సులో ఆయన 2023 సెప్టెంబరు 19న మరణించాడు.[7]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)