అచ్చమ్మ మథాయ్ | |
---|---|
జననం | కేరళ, భారతదేశం |
వృత్తి | సామాజిక కార్యకర్త |
జీవిత భాగస్వామి | జాన్ మథాయ్ |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
అచ్చమ్మ మథాయ్ ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మహిళా హక్కుల కార్యకర్త. కాలికట్ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, థియేటర్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అయిన డాక్టర్ జాన్ మథాయ్ సెంటర్ కు ఆమె సహ వ్యవస్థాపకురాలు. అలాగే, ఆమె జాన్ మథాయి భార్య. ఆయన భారతదేశపు మొదటి రైల్వే మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి.[1][2]
కేంద్ర మంత్రిత్వ శాఖలో ఆయన పనిచేస్తున్న కారణంగా వారి కుటుంబం ఢిల్లీలో ఉండేది.[3] భారత స్వాతంత్ర్యం తరువాత జరిగిన అల్లర్ల సమయంలో, ఆమె అల్లర్ల బాధితుల పునరావాసం కోసం సుచేతా కృపలానీతో కలిసి పనిచేసింది.[1] ఆమె 1955లో లైబ్రరీల సలహా కమిటీ సభ్యురాలిగా, అరవైల ప్రారంభంలో కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ గా పనిచేసింది.[4][5] 1954లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇది సమాజానికి ఆమె చేసిన కృషికి నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం, ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తులలో ఆమె నిలిచింది.[6]