అడ్డా | |
---|---|
దర్శకత్వం | జి. కార్తీక్ రెడ్డి |
నిర్మాత | నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాసరావు |
తారాగణం | సుశాంత్, శాన్వీ శ్రీవాస్తవ |
ఛాయాగ్రహణం | అరుణ్ కుమార్ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | శ్రీనాగ్ కార్పోరేషన్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2013[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అడ్డా 2013, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్, శాన్వీ శ్రీవాస్తవ జంటగా నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.[2]
అభి (సుశాంత్) ప్రేమికులకు, పిల్లలు ప్రేమించుకొని విడదీయాలనుకునే తల్లిదండ్రులకు సహాయం చేస్తూ, వారి నుండి కొంత ఫీజు వసూలు చేస్తూ ఉంటాడు. తన తండ్రి పటేల్ (నాగినీడు)ని దృష్టిలో పెట్టుకొని తన అక్క ప్రేమని చెడగొట్టాలనుకుంటున్న ప్రియ (శన్వీ) అభి గురించి విని, అతని సహాయం కోరుతుంది. దాంతో అభి ఆమెకు సహాయం చేస్తూ వుంటాడు. ఇంతలో అనుకోకుండా తను ప్రియ ప్రేమలో పడతాడు. కానీ ప్రియతో ఈ విషయాన్ని చెప్పడానికి సరైన సమయం దొరకదు. మరోవైపు ప్రియ కూడా అభికి ఎలాంటి ఫీలింగ్స్, నైతిక విలువలు లేవనుకొని తన బావ (దేవ్ గిల్)ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. చివరికి ఏం జరిగింది? అభి ప్రియ ప్రేమను గెలుచుకుంటాడా? లేదా? అనేది మిగతా కథ.
2012, జూలై 28న[5] హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించబడిన ఈ చిత్రానికి అక్కినేని నాగార్జున క్లాప్ కొట్టగా, అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విఛాన్ చేశాడు. మొదటి షాట్‌కు పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించాడు.[6] 2012, ఆగస్టు 14న మొదటి షెడ్యూల్ పూర్తయింది,[7] రెండవ షెడ్యూల్ 2012 ఆగస్టు 16న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది, సుశాంత్, షాన్వి, ఇతరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.[8] 2013, జనవరి1 న ఈ చిత్రం యొక్క టాకీభాగం చిత్రీకరణ పూర్తయింది.[9] శ్వేతా భరద్వాజ్, సుశాంత్ తో కలిసి ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది.[10] ఈ పాటను అన్నపూర్ణలోని ఏడు ఎకరాల స్టూడియోలో చిత్రీకరించారు.[11]
ఈ చిత్రంలో శాన్వీ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ గా నటించింది.[12]
2013, ఏప్రిల్ 7న హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ (యెహి హై మేరా అడ్డా... గానం: బాబా సెహగల్) విడుదలైంది. ఈ పాటను హీరో సుశాంత్ దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి నిర్మాతలు నాగసుశీల, చింతలపుడి శ్రీనివాసరావు సమక్షంలో లాంఛనంగా ప్రారంభించబడింది.[13]
ఈ చిత్రంలోని పాటలకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. జంగ్లీ మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి.[14]
క్రమసంఖ్య | పేరు | Artist(s) | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "యహీ హై మేరా అడ్డా (రచన: కృష్ణ చైతన్య)" | బాబా సెహగల్, పృథ్వీ,ధనుంజయ్, రాంఖీ | 4:14 | ||||||
2. | "నిన్నే నిన్నే చూస్తుంటే (రచన: శ్రీమణి)" | నిఖిల్ డిసౌజా, చైత్ర | 4:00 | ||||||
3. | "హేయ్ మిస్టర్ హేయ్ మిస్టర్ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | సుచిత్ర, ధనుంజయ్ | 4:04 | ||||||
4. | "ఎందుకే ఎందుకే (రచన: శ్రీమణి)" | శ్రీరామచంద్ర | 4:05 | ||||||
5. | "పరేషాన్ హే ఊలాల (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రితు పాతక్, సంతోష్, రాంఖీ | 3:54 | ||||||
6. | "ఎక్కడ ఉన్నా నీ (రచన: అనంత శ్రీరాం)" | విజయ్ ప్రకాష్ | 3:24 | ||||||
7. | "అడ్డా రూబెన్స్ క్లబ్ మిక్స్ (రచన: కృష్ణ చైతన్య)" | బాబా సెహగల్, పృథ్వీ,ధనుంజయ్, రాంఖీ | 3:50 | ||||||
27:31 |
2013, ఆగస్టు 15న ఈ చిత్రం విడుదలయింది.[17]
ఐడల్ బ్రెయిన్.కాంలో ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇవ్వబడింది. ఈ చిత్రంలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ బాగుందని పేర్కొంది. ఈ చిత్రంలో సుశాంత్ నటన, వినోదం, సంగీతం అంశాలలో ప్లస్ పాయింట్లు వచ్చాయి.[18]