అణు స్థావరాలపై దాడులు చేసుకోకూడదని భారత్ పాకైస్తాన్‌లు కుదుర్చుకున్న ఒప్పందం | |
---|---|
![]() 2012 లో భారత పాకిస్తాన్‌ల జెండాలు | |
రకం | వ్యూహాత్మక అణ్వస్త్రాల తగ్గింపు, నియంత్రణ, తద్వారా ఆణు ఘర్షణల నివారణ |
సందర్భం | ప్రచ్ఛన్న యుద్ధం |
రాసిన తేదీ | 1988 నవంబరు 30 |
సంతకించిన తేదీ | 21 డిసెంబరు 1988 |
స్థలం | ఇస్లామాబాద్, పాకిస్తాన్ |
అమలు తేదీ | 1991 జనవరి 1 |
స్థితి | ఇరుపార్టీలు ఒప్పుకున్నాయి |
కాలపరిమితి | ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉంది |
మధ్యవర్తులు | ఇరు దేశాల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు |
చర్చల్లో పాల్గొన్నవారు | ఇరు దేశాల విదేశాంగ మంత్రులు |
సంతకీయులు | రాజీవ్ గాంధీ (భారత ప్రధానమంత్రి) బేనజీర్ భుట్టో (పాకిస్తాన్ ప్రధానమంత్రి) |
కక్షిదారులు | ![]() ![]() |
ఆమోదకులు | భారత పార్లమెంటు పాకిస్తాన్ పార్లమెంటు |
Depositary | భారత, పాక్ ప్రభుత్వాలు |
భాషలు |
అణ్వాయుధేతర దాడి ఒప్పందం అనేది అణ్వాయుధాల తగ్గింపు (లేదా పరిమితి) పై భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక, అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం. అణు స్థావరాలపై దాడి చేయడానికి గాని, దాడి చేసే విదేశీ శక్తులకు సహకరించడం గానీ చేయరాదని ఇరు దేశాలు ఈ ఒప్పందంలో ప్రతిజ్ఞ చేసాయి.[1] ఈ ఒప్పందాన్ని 1988 లో రూపొందించగా, 1988 డిసెంబరు 21 న భారత ప్రధాని రాజీవ్ గాంధీ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టోలు సంతకం చేశారు. ఇది 1991 జనవరిలో అమల్లోకి వచ్చింది.[1]
ఎదటి వారి అణు వ్యవస్థాపనలు, సౌకర్యాలపై ఆకస్మిక దాడి (లేదా దాడి చేసే విదేశీ శక్తికి సహాయం చేయడానికి) చేయకుండా ఇరుదేశాలను ఈ ఒప్పందం నిషేధించింది. ఈ ఒప్పందం పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే భద్రతా వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఇరు పక్షాలు "ఎదటి దేశంలోని అణు వ్యవస్థాపన లేదా సదుపాయానికి విధ్వంసం లేదా నష్టం కలిగించే లక్ష్యంతో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గానీ ఏదైనా చర్యను చేపట్టడం, ప్రోత్సహించడం లేదా పాల్గొనడం" చేయరాదు.[1] 1992 జనవరి నుండి, భారత, పాకిస్తాన్‌లు ఏటా తమ సైనిక, పౌర అణు సంబంధిత సౌకర్యాల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకుంటాయి.
1986-87 లో భారత సైన్యం, బ్రాస్‌స్టాక్స్ అనే భారీ కసరత్తు నిర్వహించింది. అపుడు పాకిస్థాన్ అణు కేంద్రాలపై భారత్ దాడి చేస్తుందనే భయాన్ని కలిగించింది.[2] అప్పటి నుంచి ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు అణ్వాయుధాల నియంత్రణపై అవగాహనకు రావడానికి చర్చలు జరుపుతున్నాయి.
1988 సార్వత్రిక ఎన్నికల తరువాత, ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో భారత ప్రధాని రాజీవ్ గాంధీని ఆహ్వానించింది.[3] 1988 డిసెంబరు 21 న భారత ప్రధాని రాజీవ్ గాంధీ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి, ఇస్లామాబాద్‌లో ప్రధాని బెనజీర్ భుట్టోతో సమావేశమయ్యాడు.[3] "అణు దాడి రహిత ఒప్పందం"పై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ని 1991 జనవరి 27 న భారత, పాకిస్తాన్ పార్లమెంటులు అనుమోదించాయి [1] 1992 జనవరి 1 న ఇరుదేశాలు తమ అణు స్థాపనల మొదటి జాబితాను పరస్పరం మార్చుకున్నారు.[4]