అధినాయకుడు (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పరుచూరి మురళి |
---|---|
నిర్మాణం | ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి |
చిత్రానువాదం | పరుచూరి మురళి |
తారాగణం | నందమూరి బాలకృష్ణ, జయసుధ, లక్ష్మీ రాయ్, సలోని, కోట శ్రీనివాసరావు, |
సంగీతం | కల్యాణి మాలిక్ |
నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కళ్యాణి మాలిక్, రీటా, చైత్ర అంబపూడి, నేహ |
గీతరచన | భాస్కరభట్ల రవికుమార్, రామజోగయ్య శాస్త్రి |
సంభాషణలు | పరుచూరి మురళి |
ఛాయాగ్రహణం | టి. సురేంద్ర రెడ్డి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ కీర్తి క్రియేషన్స్ |
పంపిణీ | రిలయన్స్ ఎంటర్టైన్మెంట్[1] బ్లూస్కై సినిమాస్ (యుఎస్ఏ)[2] |
నిడివి | 151 నిముషాలు |
భాష | తెలుగు |
అధినాయకుడు 2012, జూన్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మాణ సారథ్యంలో పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, జయసుధ, లక్ష్మీ రాయ్, సలోని, కోట శ్రీనివాసరావు తదితరులు నటించగా, కల్యాణి మాలిక్ సంగీతం అందించాడు.[3] ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం (తాత, తండ్రి, కొడుకు పాత్రలు) చేశాడు.[4]
బాబి (బాలకృష్ణ) కాంట్రాక్టులు తీసుకొని హత్యలు చేస్తుంటాడు. తాను అనాథ కాదు తనకో కుటుంబం ఉందనే విషయం తెలుసుకోవడంతోపాటు తన తండ్రి రామకృష్ణ ప్రసాద్ (బాలకృష్ణ)ని చంపేయాటనికి తననే పంపించారని అర్దం చేసుకుంటాడు. ఫ్యాక్షనిస్ట్ (ప్రదీప్ రావత్) నుంచి తన తండ్రిని రక్షించుకోవడంకోసం ఇంటికి వెళ్ళగా, కొన్ని అపార్థాల వల్ల కొడుకుని దగ్గరకు రానివ్వడు. చివరకు బాబి.. తన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు, తన తాత హరిశ్చంద్ర ప్రసాద్ (బాలకృష్ణ) ఆశయాలు తెలుసుకుని ఏం చేసాడన్నది మిగతా కథ.
ఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతం అందించగా, ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఓలమ్మీ అమ్మీ (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రీటా | 4:30 |
2. | "గురుడా ఇలా రార (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | మనో, రీటా | 4:11 |
3. | "ఊరంతా (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | కళ్యాణి మాలిక్ | 3:52 |
4. | "మస్త్ జవానీ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | ఎస్.పి. బాలు, చైత్ర అంబడిపూడి | 3:53 |
5. | "అందం ఆకుమడి (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | మనో, నేహ | 3:49 |
6. | "అదిగో (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | కళ్యాణి మాలిక్ | 3:05 |
మొత్తం నిడివి: | 25:20 |
చాలా రోజులు వాయిదాపడిన తరువాత 2012, జూన్ 1న ఈ చిత్రం విడుదలయింది.[5]
రేటింగ్