అనంత్ కుమార్ | |||
![]() Ananth Kumar addressing the Media in New Delhi on May 12, 2017 | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | ముప్పవరపు వెంకయ్య నాయుడు | ||
తరువాత | ఖాళీ | ||
రసాయనిక, ఎరువుల శాఖ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | శ్రీకాంత్ కుమార్ జెనా | ||
తరువాత | ఖాళీ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1996 | |||
ముందు | కె. వెంకటగిరి గౌడ | ||
పౌర విమానయాన శాఖ
| |||
పదవీ కాలం 19 మార్చి 1998 – 13 అక్టోబరు 1999 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | సి. ఎం. ఇబ్రహీమ్ | ||
తరువాత | శరద్ యాదవ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెంగళూరు, మైసూరు రాష్ట్రం (ఇప్పుడు కర్ణాటక) | 1959 జూలై 22||
మరణం | 2018 నవంబరు 12[1] బెంగళూరు, కర్ణాటక | (వయసు: 59)||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | తేజస్విని కుమార్ | ||
సంతానం | 2 కూతుర్లు | ||
పూర్వ విద్యార్థి | కర్ణాటక విశ్వవిద్యాలయం |
అనంత కుమార్ (కన్నడం: ಅನಂತ ಕುಮಾರ್) దక్షిణ బెంగళూరు పార్ల మెంటరీ నియోజిక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున ప్రస్తుత 15వ లోక్ సభలో సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు.[2]
అనంత రమేష్ కుమార్ బెంగళూరులో 1959 జూలై 22 లో శ్రీ హెచ్.ఎన్.శాస్త్రి, శ్రీమతి గిరిజ దంపతులకు జన్మించారు.
వీరు కె.ఎస్.ఆర్ట్స్ కళాశాల హుబ్లిలో బి.ఎ. ఎల్.ఎల్.బి చదివారు.
అనంత కుమార్ 1988 నుండి 1995 వరకు కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్య దర్శిగా ఉన్నారు. 1995 నుండి 1998 వరకు భారతీయ జనతాపార్టీ జాతీయ కార్య దర్శిగా ఉన్నారు. 1996 లో 11 వ లోక్ సభకు ఎన్నికయి పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.. 1998 లో 12 వ లోక్ సభకు తిరిగి ఎన్నికయి కేంద్ర కాబినెట్ లో ప్రవేశించి విమాన యాన శాఖను నిర్వహించారు.ఆ తర్వాత పర్యాటక శాఖను, గ్రామీణాభివృద్ధి మంత్రిగాను పనిచేసారు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈయన మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యలో పట్టా పొందారు. ఏబీవీపీలో జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులు చేపట్టి, 1996లో తొలిసారిగా ఎన్నికల్లో గెలిచాక, వెనుదిరిగి చూసుకోలేదు. దక్షిణ బెంగళూరు నుంచి ఆరోసారి ఎంపీగా గెలిచారు. ఈసారి ఐటీ దిగ్గజం నందన్ నిలేకని పై భారీ మెజారిటీతో గెలిచారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన అనంతకుమార్ ఒకప్పుడు అద్వానీకి అత్యంత సన్నిహిత అనుయాయిగా పేరొందారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో పలు శాఖలు చేపట్టారు. పార్టీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతారు. కర్ణాటకలో పార్టీ వ్యవహారాల విషయంలో మాత్రం యడ్యూరప్ప తో విభేదాలున్నాయి.
వీరు బ్రెజిల్, ఫ్రాన్సు, జెర్మనీ, ఇటలీ, జపాన్, మలేసియా, సింగపూరు, స్విట్జర్లాండు, బ్రిటన్, అమెరికామొదలగు దేశాలను పర్యటించారు.