అనచండ్ర | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | A. ferruginea
|
Binomial name | |
Acacia ferruginea |
అనచండ్ర చెట్టు యొక్క వృక్ష శాస్త్రీయ నామం అకాసియా ఫెర్రుజినియా. అనచండ్ర ఫాబేసి కుటుంబంలో పప్పుదినుసులకు (legume) చెందిన ఒక జాతి. ఇది శ్రీలంకలో కనుగొనబడింది. అనచండ్రను అనసండ్ర, ఇనుప తుమ్మ అని కూడా అంటారు. అనచండ్ర సాధారణంగా చిన్న , కరువు నిరోధక, ఆకు రాల్చే వృక్షం. ఇది సాధారణంగా 12 మీటర్ల కంటే ఎత్తు పెరగదు. ఇది సాధారణంగా చాలా అరుదుగా 2 నుంచి 3 మీటర్ల కన్నా ఎక్కువగా తిన్నని మానును కలిగి ఉంటుంది. ఈ చెట్టు యొక్క కొమ్మలు శంఖమును పోలిన ముళ్ళతో కూడి సన్నగా ఉంటాయి. రెమ్మలు కణుపుల వద్ద గజిబిజిగా ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ప్రధాన వేర్లు పొడవుగా, సన్నగా, కూచిగా (శంఖాకారంగా), తీగలుగా పసుపు వర్ణం నుంచి గోధుమ వర్ణంలో ఉంటాయి. ఆకులు ద్వంద్వ సమ్మేళనంగా మార్చిమార్చి ఏర్పడి ఉంటాయి. ముళ్ళు జంటగా కొద్దిగా వంకర తిరిగి ఉంటాయి. సాధారణ ఆకు కాడ 7 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. సైడ్ స్ట్లాక్స్ 4 నుంచి 6 జతలు ఉంటాయి, లీఫ్ లెట్స్ 15 నుంచి 30 జతలు ఉంటాయి, ఇవి బూడిదరంగు నుంచి గ్లాకౌస్ రంగు (నీలం-బూడిద లేదా ఆకుపచ్చ రంగు)లో ఉంటాయి, వీటి సరళ పొడవు 0.6 నుంచి 1.25 సెంటీమీటర్లు.