అనన్య ఛటర్జీ | |
---|---|
జననం | అనన్య ఛటర్జీ 1977 జనవరి 16 |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | కలకత్తా విశ్వవిద్యాయలం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2000 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాజ్ ముఖర్జీ (2015-2019)[2] |
అనన్య ఛటర్జీ (జననం 16 జనవరి 1977) బెంగాలీ సినిమా నటి.[3] ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన అబొహొమాన్ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారాన్ని అందుకుంది.[4][5] టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన అనన్య, అంజన్ దత్ దర్శకత్వం వహించిన మూడు సినిమాలతో సహా పలు టీవీ సీరియల్స్, సినిమాలలో నటించింది.
అనన్య 1977, జనవరి 16న కోల్‌కతాలో జన్మించింది. జిడిబిర్లా సెంటర్లో విద్యను అభ్యసించిన అనన్య, 1994లో 10వ తరగతి పూర్తిచేసింది. కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని జోగమయ దేవి అండర్ గ్రాడ్యుయేట్ మహిళా కళాశాలలో జీవశాస్త్రం చదివింది.[6]
సంవత్సరం | సినిమా | దర్శకుడు | పాత్ర |
---|---|---|---|
2005 | రాట్ బరోటా పాంచ్ | సరన్ దత్తా | శ్యామలి |
2006 | ఆమ్రా | మైనక్ భౌమిక్ | శ్రేయ |
2007 | ప్రభు నోష్తో హోయి జై | అగ్నిదేవ్ ఛటర్జీ | జిల్మిల్ చౌదరి |
2009 | అంగ్షుమనేర్ చోబి | అతను ఘోష్ | సౌరియా రే |
డ్వాండో | సుమన్ ఘోష్ (దర్శకుడు) | సుదీప్తా | |
మామా భాగ్నే | అనుప్ సేన్‌గుప్తా | పాయెల్ | |
2010 | ల్యాప్‌టాప్ | కౌశిక్ గంగూలీ | శుభా |
అబోహోమాన్ | రితుపర్నో ఘోష్ | శిఖా సర్కార్/శ్రీమతి సర్కార్ | |
2011 | ఇతి మృణాలిని | అపర్ణా సేన్ | హియా మజుందార్ |
2012 | టీన్ కన్యా | అగ్నిదేవ్ ఛటర్జీ | నాన్సీ |
2013 | అన్వర్ కా అజాబ్ కిస్సా | బుద్ధదేవ్ దాస్‌గుప్తా | మాలిని |
2013 | మేఘే ధాకా తారా | కమలేశ్వర్ ముఖర్జీ | దుర్గా |
2014 | జోడి లవ్ డిలే నా ప్రాణే | అభిజిత్ గుహ | పరోమిత |
2014 | జాతీశ్వర్ | శ్రీజిత్ ముఖర్జీ | జోగ్గెషోరి |
2015 | జోగాజోగ్ | శేఖర్ దాస్ | శ్యామసుందరి |
2017 | తోపే (చిత్రం) | బుద్ధదేవ్ దాస్‌గుప్తా | కింగ్ భార్య |
2019 | భలో మేయే ఖరప్ మాయే | తమల్ దాస్‌గుప్తా | రియా |