అనిరుద్ధ రాయ్ చౌదురి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | భారతదేశం | 1964 జూలై 31
వృత్తి | సినిమా దర్శకుడు |
జాతీయత | భారతీయుడు |
గుర్తింపునిచ్చిన రచనలు | పింక్, అంతహీన్, అనురనన్ |
అనిరుద్ధ రాయ్ చౌదురి, భారతీయ సినిమా దర్శకుడు. ఇతడు బెంగాలీ, హిందీ సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా పనిచేశాడు. ఇతడు 2016లో దర్శకత్వం వహించిన పింక్ సినిమా అత్యంత విజయవంతమవడంతోపాటు సినీ విమర్శకుల నుండి, సినీ ప్రేమికుల నుండి ప్రశంసలను అందుకుంది.
2006లో అనురనన్ అనే బెంగాలీ సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. మూడు జాతీయ అవార్డులు, అరవిందన్ పురస్కారం, అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు, రెండు జీ సినీ అవార్డులు, రెండు ఇటిసి బాలీవుడ్ బిజినెస్ అవార్డులు, ఒక స్టార్డస్ట్ అవార్డులు , జాగ్రాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడు మొదలైన అవార్డులు అందుకున్నాడు. దాదాపు నాలుగు వందల ప్రచార చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
2016లో వచ్చిన పింక్, అనురనన్ సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నాడు. అతను 2008లో వచ్చిన అంతహీన్ సినిమాకు ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు. 2015లో వచ్చిన పికు అనే హిందీ సినిమాలో అతిధి పాత్రలో నటించాడు. సామాజిక ఇతివృత్తాలపై సినిమాలు చేస్తూ, సమస్యల గురించి ఆలోచించమని ప్రోత్సహించాడు.
సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాషలు | మూలాలు |
---|---|---|---|---|
2006 | అనురనన్ | దర్శకుడు | బెంగాలీ | |
2008 | అంతహీన్ | దర్శకుడు | బెంగాలీ | [1] |
2010 | ఏక్తి తారార్ ఖోంజే | నిర్మాత | బెంగాలీ | [2] |
2012 | అపరాజిత తుమి | దర్శకుడు | బెంగాలీ | |
2014 | బునో హాన్ష్ | దర్శకుడు | బెంగాలీ | |
2016 | పింక్ | దర్శకుడు | హిందీ |
సంవత్సరం | శీర్షిక | భాష | నెట్వర్క్ | మూలాలు |
---|---|---|---|---|
2019 | పార్చాయీ: రస్కిన్ బాండ్ రచించిన ఘోస్ట్ స్టోరీస్ | హిందీ | జీ5 ఒరిజినల్స్ | [3][4] |
2020 | ఫర్బిడెన్ లవ్ | హిందీ | జీ5 ఒరిజినల్స్ |