అనిల్ జోషి | |
---|---|
![]() | |
Born | అనిల్ జోషి 1940 జూలై 28 గొండ, గుజరాత్ , భారత దేశం |
Died | 26 ఫిబ్రవరి 2025 ముంబై, మహారాష్ట్ర, భారత దేశం | (aged 84)
Occupation | కవి, ఉపాధ్యాయుడు |
Language | గుజరాతీ |
Nationality | భారతీయుడు |
Education | మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ |
Alma mater | గుజరాత్ విశ్వవిద్యాలయం |
Period | గుజరాతి సాహిత్యం |
Years active | 1961–2025 |
Notable works |
|
Notable awards | సాహిత్య అకాడమీ అవార్డు (1990) |
Spouse |
భారతి జోషి1975 (date missing) |
Children | సంకేత్ (కొడుకు) రచన (కూతురు) |
Signature | |
![]() |
అనిల్ రమానాథ్ జోషి ( 1940 జులై 28-2025 ఫిబ్రవరి 26) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రచయిత. గుజరాతీ భాష కవి వ్యాసకర్త. అనిల్ జోషి తను రచించిన స్టాచ్యూ పుస్తకానికి గాను 1990లో గుజరాతి సాహిత్య అకాడమీ పురస్కారంను అందుకున్నారు..[1] అనిల్ జోషి రచయితగా అనేక పుస్తకాలను రాశాడు. వాటిలో కడచ్ (1970), బరాఫ్నా పంఖీ (1981), కవితల సేకరణ పవన్ ని వ్యాస్పిథే (1988), ముఖ్యమైనవి .[2]
అనిల్ జోషి 1940 జులై 28న గొండల్లో రమానాథ్ తారాబెన్ దంపతులకు జన్మించారు. అనిల్ జోషి తండ్రి విద్యాశాఖలో ఉన్నత స్థాయి అధికారి గా ఉండేవాడు. అనిల్ జోషి తన పాఠశాల విద్యను గోండాల్ మోర్బీలో పూర్తి చేశారు. 1964లో మోర్బీలోని యు. ఎన్. మెహతా ఆర్ట్స్ కళాశాల, అహ్మదాబాద్ హెచ్. కె. ఆర్ట్స్ కళాశాల నుండి అనిల్ జోషి గుజరాతీ, సంస్కృత సాహిత్యం బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. 1966లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు.[2][3]
అనిల్ జోషి 1975 జూలై 15న భారతిబెన్ ను వివాహం చేసుకున్నాడు, వీరికి సంకేత్, రచనా అనే కుమారుడు, కూతురు ఉన్నారు.[4]
అనిల్ జోషి 1962లో హిమత్నగర్ మై ఓన్ హైస్కూల్లో గుజరాతీ ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 1968 నుండి 1969 వరకు అనిల్ జోషి అమ్రేలీలోని కె. కె. పరేఖ్ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1971 నుండి 1976 వరకు, అనిల్ జోషి పత్రిక సంపాదకుడు వాడిలాల్ డాగ్లీ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. 1976 నుండి 1977 వరకు, అనిల్ జోషి పరిచయ్ ట్రస్ట్ అనే వారపత్రికకు సహ-సంపాదకుడిగా పనిచేశారు, 1977లో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా అనిల్ జోషి నియమితుడయ్యాడు, గుజరాతీ భాషా సలహాదారుగా పదవీ విరమణ చేసే వరకు అక్కడే పనిచేశారు.
1962లో అనిల్ జోషి రాసిన పరిఘో అనే కవిత మొదటిసారిగా గుజరాతీ సాహిత్య పత్రిక కుమార్ లో ప్రచురించబడింది. అనిల్ జోషి గుజరాతీలో ఆధునిక సాహిత్య ఉద్యమమైన "రీ మఠ్" తో సంబంధం కలిగి ఉన్నారు. అనిల్ జోషి ప్రముఖ రచయిత రమేష్ పరేఖ్ తో సన్నిహితంగా ఉండేవాడు .[3]
ఆయన 84 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ 2025 ఫిబ్రవరి 26న మహారాష్ట్ర రాజధాని ముంబై లో మరణించారు.[5][6]
అనిల్ జోషి రాసిన కవితల సంకలనం 1970లో మొదటిసారిగా ప్రచురించబడింది, తరువాత అమే బరాఫ్నా పంఖి (1981) పానిమాన్ గంత్ పాడి జోయి (2012) లాంటి రచనలు ప్రచురించబడ్డాయి. ఆయన గీత్, ఫ్రీ వెర్స్, గజల్స్ వంటి వివిధ రకాల కవిత్వాలలో పనిచేశారు. కానీ, ఆయన ప్రధానంగా గుజరాతీ సాహిత్యం గీత్లో చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. విగ్రహం (1988) పవన్ ని వ్యాస్పిథే (1988) లాంటి పుస్తకాలను ఆయన రచించాడు.[7]
అనిల్ జోషి 1990 సంవత్సరానికి గాను గుజరాతీ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు, అయితే హేతువాది ఎం. ఎం. కల్బుర్గి హత్య ను వ్యతిరేకిస్తూ తాను అవార్డును తిరిగి ఇచ్చారు.[1]