అనిల్ బైజాల్

అనిల్ బైజాల్
అనిల్ బైజాల్


పదవీ కాలం
31 డిసెంబర్ 2016 – 23 మే 2022
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
రామ్‌నాథ్ కోవింద్
ముందు నజీబ్ జంగ్
తరువాత వినయ్ కుమార్ సక్సేనా

వ్యక్తిగత వివరాలు

పూర్వ విద్యార్థి అలాహాబాద్ యూనివర్సిటీ

అనిల్ బైజాల్ భారతదేశానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన 31 డిసెంబర్ 2016 నుండి 23 మే 2022 వరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేశాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]

అనిల్ బైజాల్ 1969 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన గవర్నర్‌గా కాకా ముందు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్‌గా, ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శిగా, యుపిఎ హయాంలో బైజల్ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా, ప్రసార భారతి కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, గోవా డెవలప్‌మెంట్ కమీషనర్‌గా, నేపాల్‌లో భారతదేశ సహాయ కార్యక్రమానికి ఇన్‌ఛార్జ్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 May 2022). "ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాజీనామా". Archived from the original on 2 September 2022. Retrieved 2 September 2022.
  2. V6 Velugu (18 May 2022). "ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)