అనిల్ మాధవ్ దవే | |||
![]()
| |||
కేంద్ర పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 2016 జులై 5 – 2017 మే 18 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | ప్రకాష్ జవదేకర్ | ||
తరువాత | హర్షవర్థన్ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2009 ఆగస్టు – 2017 మే 18 | |||
నియోజకవర్గం | మధ్యప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బాద్నగర్, మధ్యప్రదేశ్, భారతదేశం | 1956 జూలై 6||
మరణం | 2017 మే 18 న్యూఢిల్లీ, భారతదేశం | (వయసు: 60)||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
పూర్వ విద్యార్థి | గుజరాతీ కాలేజీ, ఇండోర్ | ||
వృత్తి | పర్యావరణవేత్త, రాజకీయ నాయకుడు |
అనిల్ మాధవ్ దవే (1956 జూలై 6 - 2017 మే 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 2016 జులై 5 నుండి 2017 మే 18 వరకు కేంద్ర పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]
అనిల్ మాధవ్ దవే 1956 జూలై 6న మధ్యప్రదేశ్‌లోని బాద్‌నగర్‌లో జన్మించాడు. ఆయన గుజరాతీ కళాశాల నుండి ఎం.కామ్ పూర్తి చేశాడు.[2]
అనిల్ మాధవ్ దవే ఆర్ఎస్ఎస్ లో చేరి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన 2009లో మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై నీటి వనరుల కమిటీ, సమాచార, ప్రసారాల శాఖ కమిటీ, వాతావరణ మార్పులపై అధ్యయన కమిటీ సహా పలు కమిటీల్లో సభ్యుడిగా పని చేశాడు. అనిల్ దవే 2016లో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 2016 జులై 5న పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలను చేపట్టాడు.
అనిల్ మాధవ్ దవే అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2017 మే 18న మరణించాడు.[3]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)