అను ప్రభాకర్ | |
---|---|
![]() 2013 టీచ్ ఎయిడ్స్ ఇంటర్వ్యూలో అను ప్రభాకర్ | |
జననం | బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | 1980 నవంబరు 9
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 1 |
అను ప్రభాకర్ (జననం 1980 నవంబరు 9) భారతీయ నటి. ఆమె ప్రధానంగా కన్నడ, తమిళ చిత్రాలలో నటిస్తుంది.
ఆమె బెంగళూరులో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగి ఎం. వి. ప్రభాకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి గాయత్రి ప్రభాకర్లకు 1980 నవంబరు 9న జన్మించింది. బెంగుళూరులోని మల్లేశ్వరం శివారులో పెరిగిన ఆమె నిర్మలా రాణి ఉన్నత పాఠశాలలో చదువుకుంది. చపల చెన్నిగరాయ (1990), శాంతి క్రాంతి (1991), ఆంగ్ల చిత్రం మిస్టరీస్ ఆఫ్ ది డార్క్ జంగిల్ (1990)లలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఆమె కథానాయికగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసింది.[1] ఆ తరువాత, ఆమె దూర విద్య విధానంలో కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది.[2]
1999లో శివ రాజ్‌కుమార్ సరసన హృదయ హృదయ చిత్రంతో హీరోయిన్గా అరంగేట్రం చేసిన ఆమె కన్నడ చిత్రాల్లో టాప్ రేంజ్ హీరోయిన్గా ఎదిగింది. ఆమె రమేష్ అరవింద్ సరసన నటించి సినిమా తెరపై ప్రముఖ జంటగా ఏర్పడింది. ఆమె సూరప్ప (2000), జమీందారు, హృదయవంత, సాహుకార, వర్ష వంటి అనేక చిత్రాలలో సూపర్ స్టార్ విష్ణువర్ధన్తో కలిసి నటించింది. ఆమె కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించింది. 2009లో, లాభాపేక్షలేని సంస్థ టీచ్ ఎయిడ్స్(TeachAids) రూపొందించిన ఎయిడ్స్ ఎడ్యుకేషన్ యానిమేటెడ్ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్కి ఆమె తన గాత్రాన్ని అందించింది.[3] 12వ శతాబ్దపు కన్నడ కవయిత్రి అక్క మహాదేవి జీవితం ఆధారంగా ఆమె 2020లో తీసిన చిత్రంలో, ఆమె ద్విపాత్రాభినయం చేసింది; ఒక పాత్ర కవి కాగా, మరొకరు అక్క మహాదేవిపై పి.హెచ్.డి చేసిన జ్యోతి[4]
ఏప్రిల్ 2016లో, నటుడు రఘు ముఖర్జీని ఆమె వివాహం చేసుకుంది.[5] వీరికి నందన అనే కుమార్తె ఉంది.[6] అంతకుముందు ఆమె నటి జయంతి కుమారుడు కృష్ణ కుమార్‌ను వివాహం చేసుకుంది. వారు విభేదాల కారణంగా జనవరి 2014 లో విడాకులు తీసుకున్నారు.
అను ప్రభాకర్‌ను బెంగుళూరులోని కోలాడ మఠం వారు వివిధ చిత్రాలలో ఆమె నటనకు అభినయ సరస్వతి బిరుదుతో సత్కరించారు. ఆమె కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డు 2000–01 వంటి మరెన్నో అవార్డులను సొంతం చేసుకుంది.