అనుపమ కుమార్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | అనుపమ ప్రకాష్ కుమార్ |
వృత్తి | నటి, నిర్మాత, మోడల్, యాంకర్, టెలివిజన్ కార్యక్రమాల నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | జి. శివకుమార్ |
పిల్లలు | 1 |
అనుపమ ప్రకాష్ కుమార్ (జననం 1974 డిసెంబరు 4) భారతీయ నటి, మోడల్.[1] 300లకు పైగా వాణిజ్య ప్రకటనలలో చేసిన ఆమె, 2003 కన్నడ చిత్రం పార్థతో నటిగా అరంగేట్రం చేసింది. ఆమె ఎక్కువగా తమిళ చిత్రాలలో సహాయక పాత్రలు పోషించింది.[2] తెలుగు తెరకు కూడా ఆమె పరిచయమే.
నటన మోడలింగ్‌లతో పాటు, ఆమె జర్నలిస్ట్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, ప్రొడ్యూసర్ గా కూడా పనిచేసింది.[3] ముప్పోజుదుమ్ ఉన్ కర్పనైగల్ (2012), సార్పట్ట పరంపర (2023)లతో సహా పలు చిత్రాలలో ఆమె తల్లి పాత్రలు పోషించింది.[4]
తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన అనుపమ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో నివసించింది. ఆమె టెలివిజన్ రంగంలో యాంకర్, విజువలైజర్, జర్నలిస్ట్, నిర్మాతగా కెరీర్ లో ఎక్కువ సమయం పనిచేసింది. తర్వాత ఆమె మోడలింగ్, నటన వైపు వచ్చింది. షారుఖ్ ఖాన్, మోహన్ లాల్ వంటి అగ్ర హీరోలతో పాటు 300 కంటే ఎక్కువ వాణిజ్య ప్రకటనలలో ఆమె నటించింది. ఆమె కభీ ఆయే నా జుదాయి, మిషన్ ఫతే, షక లక బూమ్ బూమ్ ది మ్యాజిక్ మేకప్ బాక్స్ వంటి అనేక హిందీ భాషా టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది. 2010లో, ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ఇష్కియాలో అతిధి పాత్ర పోషించింది.[5]
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)