అనుమోలు రామకృష్ణ (1939–2013) ప్రముఖ సివిల్ ఇంజినీరు. నిర్మాణ రంగంలో విశేషమైన కృషి చేసారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన L&T కంపెనీలో డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసారు. వీరికి మరణాంతరం శాస్త్ర సాంకేతిక రంగాలలో వీరు చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1914లో పద్మవిభూషణ్ బిరుదు నిచ్చి గౌరవించింది.
అనుమోలు రామకృష్ణ గారు కృష్ణా జిల్లా పునాదిపాడు గ్రామంలో 1939 డిసెంబరు 20న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన తరువాత మద్రాసు గిండీ ఇంజినీరింగ్ కాలేజీ నుండి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ లో మాస్టర్ డిగ్రి చేసారు.1966లో జర్మన్ లో ఆధునిక నిర్మాణ రీతులపై శిక్షణ పొందారు.
రామకృష్ణ గారు 1962 లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన L&T కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగ ప్రస్తావం చేసారు. ఆ కంపెనీలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించి కంపెనీలో డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ గా 2004లో పదవి విరమణ చేసారు. నిర్మాణంలో ఉపయోగించే సెంట్రింగ్ పద్దతులలో నూతన ఆవిష్కరణలు చేసి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా తోడ్పడ్డారు. ప్రీ స్ట్రస్ టెక్నాలజీ లో అనేక అవిష్కరణలను ప్రవేశపెట్టారు.
అనుమోలు రామకృష్ణ గారు 2013 ఆగస్టు 20 న 73 సంవత్సరాల వయస్సులో మరణించారు.
వీరికి మరణాంతరం శాస్త్ర సాంకేతిక రంగాలలో వీరు చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1914లో పద్మవిభూషణ్ బిరుదు నిచ్చి గౌరవించింది.
Anumolu Ramakrishna, From English Wikipedia