సుశాంత్ | |
---|---|
జననం | అనుమోలు సుశాఅంత్ 1986 మార్చి 18[1] భారతదేశం |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | అనుమోలు సత్యభూషణరావు అక్కినేని నాగసుశీల |
బంధువులు | అక్కినేని నాగేశ్వరరావు (తల్లిపరపున తాత) అక్కినేని నాగార్జున (లల్లి తరపున మామయ్య) యార్లగడ్డ సుమంత్ కుమార్ అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ అక్కినేని అమల |
అనుమోలు సుశాంత్ తెలుగు సినిమా నటుడు. ఆయన ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. అక్కినేని నాగార్జునకు మేనల్లుడు. ఆయన ప్రముఖ తెలుగు సినిమా నటులైన యార్లగడ్డ సుమంత్ కుమార్, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ యొక్క బంధువు. ఆయన తండ్రితరపున తాతయ్య అయిన ఎ.వి.సుబ్బారావు కూడా చిత్రపరిశ్రమకు చెందినవాడు. ఎ.వి.సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై సుమారు 25 చిత్రాలకు 1970 నుండి 1980 వరకు నిర్మాతగా ఉన్నారు.
సుశాంత్ హైదరాబాదుకు తీసుకొని రాబడినాడు. ఆయన అనుమోలు సత్య భూషణరావు, అక్కినేని నాగసుశీలలకు జన్మించాడు. హైదరాబాదులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసాడు. ఇంటర్మీడియట్ విద్యను గౌతమి జూనియర్ కళాశాలలో పూర్తిచేసాడు. ఆయన ఉర్బానా-చాంపైన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో బి.ఎస్. పూర్తిచేసాడు. ఆయన యునైటెడ్ టెక్నాలజీస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా నటునిగా ప్రవేశించక ముందు ఉద్యోగం చేసాడు. ఆయన తన కజిన్ అయిన నాగచైతన్యతో పాటుగా ముంబై లోని క్రియేటింగ్ కారెక్టర్స్ ట్రైనింగ్ స్కూలులో నటనపై శిక్షణ పొందాడు.[2]
సుశాంత్ 2008 లో కాళిదాసు చిత్రం ద్వారా చిత్రరంగంలోకి అడుగు పెట్టాడు. ఈ చిత్రం శ్రీనివాస్ చింతలపూడి, నాగసుశీల చే శ్రీనాగ్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మించబడింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టుడియోస్ సమర్పించింది. ఈ చిత్రంలో సుశాంత్ తమన్నాతో జంటగా నటించాడు. ఈ చిత్రానికి జి.రవిచరణ్‌రెడ్డి దర్శకత్వం వహించాడు.
తరువాతి చిత్రం పేమకథతో కూడిన కరెంట్ 2009 లో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తే స్నేహా ఉల్లాల్ కథానాయకిగా నటించారు. ఈ రెండు చిత్రాలలో సుశాంత్ నాట్య, ఫైటింగ్ నైపుణ్యాలలో అభినందించబడ్డాడు.
సుశాంత్ మూడవ సినిమా అడ్డా వినోదాత్మక చిత్రం. ఈ చిత్రాన్ని జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తే అనోప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఆయనకు సహ నటిగా లవ్‌లీ చిత్రంతో రంగప్రవేశం చేసిన నటి శాన్వీ శ్రీవాస్తవ నటించింది. ఈ చిత్రాన్ని మొట్టమొదటిసారిగా నాగార్జున 2013 మార్చి 18న విడుదల చేసాడు.[3] ఈ చిత్రం యొక్క టైటిల్ సాంగ్ ను 2013 ఏప్రిల్ 7 న హైదరాబాదులో ఐ.పి.ఎల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో చిత్రీకరించారు.[4] ప్రచార వీడియోలను తరువాత ప్రారంభించారు. అత్యధిక అంచనాలతో అడ్డా విడుదలైనా అనుకున్న స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయింది. కాని సుశాంత్ నటనా నైపుణ్యానికి అభినందించబడ్డాడు.
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2008 | కాళిదాసు | కాళిదాసు | [5] | |
2009 | ప్రస్తుత | సుశాంత్ | [6] | |
2013 | అడ్డా | అభి | ||
2015 | దొంగాట | అతనే | "బ్రేక్ అప్ అంటూ" పాటలో | |
2016 | ఆటాడుకుందాం రా | కార్తీక్ | ||
2018 | చి ల సౌ | అర్జున్ | [7] | |
2020 | అలా వైకుంఠపురములో | రాజ్ మనోహర్ | ||
2021 | ఇచట వాహనములు నిలుపరాదు | అరుణ్ | [8] | |
2023 | రావణాసుర | రామ్ | [9] | |
భోలా శంకర్ | చిత్రీకరణ | [10] |
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2022 | మా నీళ్ల ట్యాంక్ | వంశి | [11] |