వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అనురాధ దొడ్డబల్లాపూర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | దావణగెరె, కర్ణాటక, భారత దేశము | 1986 సెప్టెంబరు 10|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి బౌలింగ్ ఫాస్ట్/మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 15) | 2020 4 ఫిబ్రవరి - ఒమన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 3 జులై - నంబియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 18 | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
కర్ణాటక మహిళా క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
నార్థంబర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
2013–2014 | ఫ్రాంక్ ఫర్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
2013–2015 | కొలిగ్న్ | |||||||||||||||||||||||||||||||||||||||
2016– | ఫ్రాంక్ ఫర్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 18 నవంబర్ 2022 |
అనురాధ దొడ్డబల్లాపూర్ ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె దావణగెరెలో 1986 సెప్టెంబరు 10న జన్మించింది. అయితే ఆమె జర్మనీలో స్థిరపడి, క్రమంగా జర్మనీ క్రికెట్ జట్టుకు బలమైన బౌలర్ గా ఆడి జట్టుకు నాయకత్వం వహించింది. 2020 ఆగస్టులో, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.
అనురాధ దొడ్డబళ్లాపూర్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులోని బసవనగుడి. ఆమె బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో చదివింది. ఆమె చిన్నతనంలో తన పాఠశాలలో సహ విద్యార్థి క్రీడలలోకి వెళ్ళడముతో, ఇంకా ఆమె కుటుంబంలో వారికి క్రీడలపై ఉన్న ఆసక్తి కారణంగా ఆమె క్రికెట్ క్రీడను చేపట్టింది.
వృత్తి పరంగా ఆమె గుండె, రక్త ప్రసార (కార్డియోవాస్కులర్) విషయాలకు సంబంధించిన విజ్ఞాన శాస్త్ర వేత్త. ఆమె ప్రస్తుతం 'బాడ్ నౌహీమ్' లోని 'మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్ట్ అండ్ లంగ్ రీసెర్చ్' లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ సైంటిస్ట్. ప్రస్తుతం అనురాధ ఫ్రాంక్‌ఫర్ట్‌లోని బోకెన్‌హీమ్‌లోని ఒక ఇంట్లో నివసిస్తున్నారు.[1]
ఆమె 1998–99 సీజన్‌లో 12 సంవత్సరాల వయస్సులో తన జట్టులో తోటి క్రీడాకారుడు సూచించిన మేరకు కర్ణాటక మహిళా క్రీడాకారుల సంఘం నిర్వహించిన శిక్షణా బృందంలో చేరింది. ఆ తర్వాత ఆమె కర్ణాటక క్రికెట్ సంస్థ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్) లో చేరింది. కర్ణాటక U16 జట్టులో ఎంపికైంది. ఆమె కర్ణాటక మహిళా క్రికెట్ జట్టుతో తన స్థానాన్ని సుస్థిరం చేయడానికి ముందు U19 స్థాయిలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించింది. దాదాపు ఒక దశాబ్దం పాటు ఆడింది.
ఆమె బెంగుళూరులోని 'న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్' నుండి జీవ సాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) లో తన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందింది. ఆమె బ్యాచిలర్ డిగ్రీని పొందిన తర్వాత, న్యూకాజిల్ విశ్వవిద్యాలయంలో మెడికల్ జెనెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు 2008లో UKకి వెళ్లింది. క్రికెట్, ఇంకా ఉన్నతవిద్య మధ్య ఆమె చిక్కుకోవడంతో ఆమె డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొంది.
అనురాధ కూడా ఉన్నత విద్యకు కట్టుబడి, ఇంగ్లాండ్‌లోని క్లబ్‌లు, కౌంటీల కోసం క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఆమె నార్తంబర్ ల్యాండ్ మహిళల కౌంటీ జట్టు, సౌత్ నార్త్ క్రికెట్ క్లబ్‌తో పాటు న్యూకాజిల్ విశ్వవిద్యాలయం జట్టు కోసం కొన్ని సీజన్‌లలో కూడా క్రికెట్ ఆడింది. UKలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత, ఆమె 2011లో ఫ్రాంక్‌ఫర్ట్ లోని గోథే విశ్వవిద్యాలయంలో కార్డియోవాస్కులర్ బయాలజీలో PhD చేయడానికి జర్మనీకి వలస వచ్చింది.
ఫ్రాంక్‌ఫర్ట్‌లో స్థిరపడిన తర్వాత, ఆమె తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగించేందుకు నగరంలో తనకు తగిన ఫ్రాంక్‌ఫర్ట్ క్రికెట్ క్లబ్ (FCC) లో చేరింది. ఇక్కడ మహిళల జట్టు అందుబాటులో లేకపోవడంతో ఆమె పురుషుల క్రికెట్ జట్టులో చేరవలసి వచ్చింది. ఆమె 2013 నుండి 2015 వరకు జర్మన్ ఉమెన్స్ బుండెస్లిగాలో కొలోన్ మహిళల జట్టు కోసం కొంతకాలం పనిచేసింది. అనురాధ 2015లో ఎఫ్‌సిసిలో ఫ్రాంక్‌ఫర్ట్ మహిళల క్రికెట్ జట్టును స్థాపించారు, ఆరంభం నుండి జట్టుకు ఆమె శిక్షకురాలుగా ఉంది. ఆమె ECB లెవెల్ 2 క్వాలిఫైడ్ కోచ్.[2] 2021లో, ఆమె తన మొట్టమొదటి బుండెస్లిగా ఛాంపియన్‌షిప్‌కు నాయకత్వం వహించి శిక్షకురాలుగా వ్యవహరించింది. దాని 10 సీజన్ మ్యాచ్‌లను అజేయంగా నడిపించిన తర్వాత, ఆ జట్టు చివరి రోజు ఆటలో SV డామ్‌షాగెన్‌పై 194 పరుగుల తేడాతో గెలిచింది.[1]
2013లో జర్మనీ జాతీయ జట్టు శిక్షణా శిబిరానికి అనురాధ తన తొలి మేడెన్ ను అందుకుంది. 2013 ఆగస్టులో, ఆమె జెర్సీ ఆతిథ్యమిచ్చిన మహిళల T20 యూరోపియన్ టోర్నమెంట్‌లో జర్మనీ తరపున మొదటి అంతర్జాతీయ పోటీలో ఆడింది.[2]
2016 ఆగస్టులో, డెన్మార్క్‌లోని హెర్నింగ్‌లో జరిగిన 6-దేశాల యూరోపియన్ మహిళల T20 పోటీలలో జర్మనీ తరపున ఆడిన అనురాధ ముఖ్యమైన క్రీడాకారిణులలో ఒకరు. జర్మనీ ఫ్రాన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో, అనురాధ 35 పరుగులతో అత్యధిక పరుగులు చేసింది, కానీ జట్టు వెంట్రుక వాసిలో ఓడిపోయింది. నార్వేపై, జర్మనీ రెండవ మ్యాచ్‌లో, ఆమె నాలుగు ఓవర్లలో ఐదు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది. ఈ మ్యాచ్‌లో జర్మనీ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరుసటి రోజు, జర్మనీ తన నాల్గవ మ్యాచ్ డెన్మార్క్‌తో, ఆమె నాలుగు ఓవర్లలో 10 పరుగులిచ్చి మూడు వికెట్లతో ముగించింది. ఆ మ్యాచ్‌లో కూడా జర్మనీ గెలిచింది. ఫ్రాన్స్‌తో చివరి పోటీలో రన్నరప్‌గా నిలిచింది.[3]
2017 మేలో, అనూరాధ ఈసారి బోలోగ్నాలో ఇటలీతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో జర్మనీ 2-1తో గెలిచింది. మొదటి రెండు మ్యాచ్‌లలో, ఆమె వరుసగా 34, 29 పరుగులతో అత్యధిక స్కోరు చేసింది. మొదటి మ్యాచ్‌లో జర్మనీ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆఖరి మ్యాచ్‌లో, అనురాధ 30 పరుగులు చేసింది స్టెఫానీ ఫ్రోన్‌మేయర్ (30 ) తో కలిసి జర్మనీని మరో 6 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేర్చింది.[4] ఆరంభం నుంచి జాతీయ జట్టులో అనురాధ నిలకడగా రాణిస్తోంది. ఆమె 2017లో జాతీయ జట్టుకు నాయకురాలిగా నియమించబడింది.[2]
2020 ఫిబ్రవరి 4న, ఒమన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ మొదటి మ్యాచ్‌తో ఆమె WT20Iకు ఆరంభం చేసింది.[5] 2020 ఆగస్టు 14న, సీబార్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్, నాల్గవ మ్యాచ్‌లో, ఆమె WT20I క్రికెట్‌లో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసిన మొదటి అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది.[6][7] లసిత్ మలింగ, రషీద్ ఖాన్ ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ అనురాధ. ఆమె WT20I పోటీలలో మొత్తం పంతొమ్మిదవ హ్యాట్రిక్ సాధించింది. అన్నే బియర్విష్ తర్వాత ఆమె హ్యాట్రిక్ సాధించిన రెండవ జర్మన్ క్రీడాకారిణి. WT20I లలో ఆమె మొదటి ఐదు వికెట్లు కూడా సాధించింది.[8] WT20I క్రికెట్‌లో జర్మనీ తరపున ఒక బౌలర్ చేసిన కెరీర్ బెస్ట్ బౌలింగ్ T20I క్రికెట్‌లో కెప్టెన్ (పురుష లేదా ఆడ) అత్యుత్తమ గణాంకాలు అయిన 5/1తో అనూరాధ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో క్రికెట్ జీవితం ముగించింది.[9][10]
2021 జూలైలో, ఫ్రాన్స్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌కు జర్మనీ జట్టుకి నాయకత్వం వహించడానికి ఆమె ఎంపికైంది.[11] ఆమె WT20I సిరీస్‌లో 7 వికెట్లు తీసిన అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణి.[12] ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని అందుకుంది. మరుసటి నెలలో, 2021 ICC మహిళల T20 ప్రపంచ కప్ ఐరోపా క్వాలిఫైయర్‌లో జట్టు నాలుగు మ్యాచ్‌లకు ఆమె జర్మనీ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించింది.[13] ఫ్రాన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో, ఆమె 22* పరుగులతో అత్యధిక స్కోర్ చేసింది.[14]