అన్నపూర్ణ మహారాణా

అన్నపూర్ణ మహారాణా
జననం(1917-11-03)1917 నవంబరు 3
మరణం2012 డిసెంబరు 31(2012-12-31) (వయసు 95)
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త
జీవిత భాగస్వామిశరత్ చంద్ర మహారాణా
పిల్లలుకుమారదేవ్ మహారాణా, జ్ఞానదేవ్ మహారాణా

అన్నపూర్ణ మహారాణా (నవంబర్ 3, 1917 - డిసెంబర్ 31, 2012) భారతదేశ స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చాలా చురుకుగా పనిచేసింది. సామాజిక, మహిళల హక్కుల కార్యకర్తగా[1] పనిచేసిన ఈవిడ గాంధీజీకి యొక్క దగ్గరి మిత్రురాలు.[2]

జననం

[మార్చు]

అన్నపూర్ణ 1917, నవంబర్ 3న గోపబంధు చౌదరి, రామదేవి దంపతులకు ఒడిశాలోని కటక్లో జన్మించింది.[1][3]

ఉద్యమంలో పాత్ర

[మార్చు]

అన్నపూర్ణ తల్లిదండ్రులు యునైటెడ్ కింగ్‌డమ్ నుండి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.[1] తల్లిదండ్రుల స్ఫూర్తితో అన్నపూర్ణ పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే గాంధీజీకి మద్దతుగా ప్రచారం సాగించింది.[1] అంతేకాకుండా 1934లో గాంధీ ఆధ్వర్యంలో ఒరిస్సాలోని పూరి నుండి భద్రక్ వరకు జరిగిన "హరిజన్ పాద యాత్ర"లో పాల్గొన్నది.[1] 1942 ఆగస్టులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం భాగంగా శాసనోల్లంఘన నేరంకింద అరెస్టుకావడంతోపాటూ అనేకసార్లు అరెస్టు చేయబడింది.[1]

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారతదేశంలోని స్త్రీలు, పిల్లల తరఫున వాదించడమేకాకుండా గిరిజన ప్రాంతంలోని పిల్లలకు రాయగడ జిల్లాలో ఒక పాఠశాలను కూడా ప్రారంభించింది.[1] వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో కూడా పాల్గొన్నది.[1] భారత అత్యవసర స్థితి విధించిన సమయంలో రామాదేవి చౌదరి యొక్క గ్రామీ సేవాక్ ప్రెస్ లోవార్తాపత్రికలు ప్రచురించేందుకు సహకరించింది. ప్రభుత్వం ఆ ఈ వార్తాపత్రికను నిషేధించడమేకాకుండా రామదేవి చౌదరి, నబకృష్ణ చౌదరి, హరేక్రునా మహాత్బాబ్, మన్మోహన్ చౌదరి, జేక్రుశన మొహంతి లను, ఇతర నాయకులను అరెస్టు చేయించింది.[4]

2012, ఆగస్టు 19న కటక్ లోని అన్నపూర్ణ ఇంటిలో జరిగిన వేడుకలో సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఒడిశా నుండి గౌరవ డిగ్రీ అందుకుంది.[5]

వివాహం

[మార్చు]

శరత్ చంద్ర మహారాణాతో అన్నపూర్ణ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (కుమారదేవ్ మహారాణా, జ్ఞానదేవ్ మహారాణా)

మరణం

[మార్చు]

అన్నపూర్ణ 96 సంవత్సరాల వయసులో సుదీర్ఘ అనారోగ్యంలో 2012, డిసెంబర్ 31న రాత్రి గం 10.30 నిముషాలకు కటక్, బహరాబాద్ లోని తన ఇంటిలో మరణించింది.[1] 2013 జనవరి 2న కటక్ లోని ఖన్నాగర్ శ్మశానంలో గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.[2] ఈవిడ భర్త శరత్ మహారాణా 2009లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Noted freedom fighter Annapurna Maharana dies". Press Trust of India. Business Standard. 1 January 2013. Retrieved 13 August 2018.
  2. 2.0 2.1 "Annapurna Maharana cremated". Times of India. 3 January 2013. Archived from the original on 15 జూన్ 2013. Retrieved 13 August 2018.
  3. "Odisha: Freedom fighter Annapurna Maharana passed away". Orissa Diary. 31 డిసెంబరు 2012. Archived from the original on 13 మార్చి 2013. Retrieved 13 ఆగస్టు 2018.
  4. Orissa: the dazzle from within (art, craft and culture of ...by G. K. Ghosh - 1993 - - Page 37
  5. "Central University Odisha confers Honoris Causa to Annapurna Moharana". Odisha Diary. 19 August 2012. Archived from the original on 11 మార్చి 2013. Retrieved 13 August 2018.