అన్నవరం (2006 సినిమా) (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భీమినేని శ్రీనివాసరావు |
---|---|
నిర్మాణం | ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, ఆర్. బి. చౌదరి |
రచన | పేరరసు, అబ్బూరి రవి |
తారాగణం | పవన్‌కల్యాణ్, అసిన్, సంధ్య, వేణుమాధవ్, నాగబాబు, ఆశిష్ విద్యార్థి, లాల్, శివబాలాజీ, బ్రహ్మానందం, శకుంతల, కల్పన, హేమ, భార్గవి, సంధ్య |
సంగీతం | రమణ గోగుల |
ఛాయాగ్రహణం | సేతు శ్రీరాం |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ |
పంపిణీ | దిల్ రాజు, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఉషా పిక్చర్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 29, 2006 |
నిడివి | 174 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పెట్టుబడి | 16 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అన్నవరం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 2006లో విడుదలైన సినిమా.[1] పవన్ కల్యాణ్, కాదల్ సంధ్య, అసిన్ ఇందులో ప్రధాన పాత్రధారులు.
అన్నవరం (పవన్ కల్యాణ్) కు చెల్లెలు వరలక్ష్మి (సంధ్య) అంటే ప్రాణం. ప్రశాంతమైన పల్లెటూరిలో పెరిగిన తన చెల్లెల్ని హైదరాబాదులో ఉంటున్న వరుడికి (శివ బాలాజీ) కి ఇచ్చి వివాహం చేస్తారు. అక్కడ కొంతమంది గూండాలు వచ్చి వరలక్ష్మిని, ఆమె భర్తను వేధిస్తారు. అప్పుడే వరలక్ష్మి తొలి కానుపు కోసం పుట్టింటికి వస్తుంది. అన్నవరం హైదరాబాదుకు వెళ్ళి తన చెల్లెలు తిరిగి హైదరాబాదుకు వెళ్ళేలోగా గూండాలను నామరూపాల్లేకుండా చేసి వస్తాడు.