అన్నా రాజం మల్హోత్రా (1927 జూలై 17 – 2018 సెప్టెంబరు 17)[1] భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్.[2] 1951లో ఆమె సివిల్ సర్వీస్‌లో చేరి మద్రాస్‌లో పనిచేసింది. అప్పటి ముఖ్యమంత్రి సీ. రాజగోపాలచారి ప్రభుత్వంలో ఆమె కీలక బాధ్యతలు చేపట్టింది. ఆమె తన భారత 17వ రిజర్వుబ్యాంకు గవర్నరుగా ఉన్న ఆర్.ఎన్.మల్హోత్రా ను వివాహం చేసుకుంది.[3][4]
ఆమె కేరళలోని నిరనం, అలెప్పీ లో 1927 జూలై 17న ఒట్టావెల్లి ఓ.ఎ.జార్జి, అన్నాపౌలి దంపతులకు జన్మించింది. ఆమె మలయాళం రచయిత "పాలియో పాల్" కు మనుమరాలు. ఆమె కాలికట్ లో పెరిగింది. ప్రావిడెన్స్ మహిళా కళాశాలలో ఇంటర్మీడియట్ ను, కాలికట్ లోణి మలబార్ క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ ను పూర్తిచేసింది. 1949లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం పై మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది. 1950లో సివిల్ సర్వీసు పరీక్షలు ఉత్తీర్ణురాలయింది. 1985 నుంచి 1990 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఆర్.ఎన్.మల్హోత్రా ఆమె పెళ్లి చేసుకుంది.[3] గుర్రపు స్వారీ, షూటింగ్‌లోనూ అన్నా శిక్షణ పొందింది. మొదటిసారి హోసూరు సబ్ కలెక్టర్‌గా చేసింది. ఏడుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆమె ఆఫీసర్‌గా చేసింది. 1982 ఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్ ప్రాజెక్టుకు ఇంచార్జ్‌గా చేసింది.i.[3][5]
1951లో సివిల్స్‌కు ఎంపికైన ఆమెకు, ఆరంభంలోనే అవమానాలు ఎదురయ్యాయి. ఆడవారు, మగవారిలా అన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించలేరని, విధులు నిర్వర్తించలేరనీ పోస్టింగ్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. మద్రాసు తొలి ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారి కూడా తన పేషీలో ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదట. దీనిపై న్యాయపోరాటం చేసిన ఆమె, చివరకు అనుకున్నది సాధించింది.[3][5][6]
ఆమె హోసూరు సబ్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఓ గ్రామంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోన్న ఆరు ఏనుగులపై కాల్పులకు ఆదేశాలివ్వాలని ఒత్తిడి వచ్చినా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నది. గజరాజులను సురక్షితంగా అడవికి వెళ్లేలా చేసింది.[7]
ముంబైలో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది. ఆ ట్రస్ట్‌కు ఆమె చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరించింది. 1982లో ఢిల్లీలో ఏసియన్ గేమ్స్ నిర్వహించినప్పుడు వాటి వ్యవహారాలను ఆమెనే చూశారు. ఈ సమయంలో ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. కేంద్ర హోంశాఖలోనూ కీలక పదవులు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వంలో సెక్రటేరియల్ ఉద్యోగాన్ని నిర్వహించిన మొదటి మలయాళీ మహిళగా గుర్తింపు పొందింది. [5]
1989లో ఆమెకు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. [8][5]